బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మ్యూజియం ఆఫ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సందర్శకులను అనుమతించింది. సీపీసీ శతాబ్ది చరిత్రకు నివాళి అర్పించడానికి వేలాదిమంది చాయెంగ్ జిల్లాలో ఉన్న ఈ మ్యూజియంను గురువారం నుంచి సందర్శిస్తున్నారు. దాదాపు 50,000 మంది ప్రజలు 1,000 రోజులు పని చేసి ఈ మ్యూజియం నిర్మాణాన్ని మే నెలలో పూర్తి చేశారు. చైనీస్ అక్షరం ‘గాంగ్’ ఆకారంలో మ్యూజియం నిర్మాణం జరిగింది. ఇది క్షితిజ సమాంతర హెచ్ లాగా కనిపిస్తుంది. ‘గాంగ్’ అంటే చైనీస్ భాషలో కార్మికులు లేదా శ్రమను సూచిస్తుంది. మ్యూజియంలో పార్టీ చరిత్రతోపాటు పార్టీ ప్రారంభ రోజుల స్మృతులు ప్రదర్శనలో పెట్టారు. 2,600కి పైగా చిత్రాలు, 3,500 ప్రదర్శనల సెట్లు ఉన్నాయి. వస్తువులలో బ్రస్సెల్స్ నుండి కార్ల్ మార్క్స్ నోట్స్‌కు సంబంధించిన మాన్యుస్క్రిప్ట్ ఉంది. ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు ప్రజలకు ఉచిత సందర్శన నిమిత్తం ఆన్‌లైన్ నియామకాలను అంగీకరించింది. సమీపంలో నివసిస్తున్న 72ఏళ్ల లిన్ చెంగ్లాన్ ప్రతిరోజు సందర్శనకు వస్తున్నారు. ‘న్యూ చైనా స్థాపించబడిన సంవత్సరంలోనే నేను పుట్టాను. పార్టీ నాయకత్వంలో దేశం ఎలా అభివృద్ధిచెందిందో నేను చూశాను’ అని లిన్ అన్నారు. ‘నేను మొదటి అవకాశంలో మ్యూజియాన్ని సందర్శించాలి’ అని పేర్కొన్నారు. కొవిడ్`19 నిబంధనల కారణంగా రోజువారీ సందర్శనకు 3000 మందికి పరిమితం చేశారు. ‘యువతరాలకు సీపీసీి చరిత్ర, ద్వి శతాబ్ది లక్ష్యాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం’ అని ఒక వృద్దుడు పేర్కొన్నారు. ‘నా మనవరాలు ద్వి శతాబ్ది లక్ష్యాన్ని (చైనాను అన్ని విధాలుగా గొప్ప ఆధునిక సోషలిస్ట్ దేశంగా నిర్మించడం) చూస్తుందని నాకు నమ్మకం ఉంది’ అని అన్నాడు. సీపీసీ 1921లో స్థాపించబడిరది, ‘చైనా ప్రజలకు ఆనందం, దేశానికి పునరుజ్జీవనం ఇవ్వడం’ అనే లక్ష్యాన్ని సీపీసీ చేపట్టింది. 50 మంది సభ్యులతో ప్రారంభమైన సీపీసీి నేడు 95 మిలియన్లకు చేరుకొని..ప్రపంచంలోనే అతిపెద్ద పాలక పార్టీగా ఉంది. సీపీసీ 1.4 బిలియన్లకు పైగా జనాభా కలిగిన చైనా దేశానికి నాయకత్వం వహిస్తున్నది.