కార్టోమ్ : సూడాన్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) తీవ్రంగా ఖండిరచింది. కష్టాల్లో ఉన్న సూడాన్ ప్రజలకు, కార్మిక వర్గానికి సూడాన్ కమ్యూనిస్టుపార్టీ సహచరులకు కేకేఈ పూర్తి సంఫీుభావాన్ని ప్రకటించింది. సూడాన్ ప్రభుత్వాన్ని మిలిటరీ హస్తగతం చేసుకోవడంతో సహకరించిన బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా కేకేఈ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. సూడాన్‌లోని తాజా పరిణామాలపై సూడాన్ కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌సీపీ) అంతర్జాతీయ సంఫీుభావం కోసం అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది. తిరుగుబాటు యత్నాన్ని విరమించే వరకు దేశంలో తమ ప్రదర్శనను కొనసాగించాలని మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము అని సూడాన్ కమ్యూనిస్టు పార్టీ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు ప్రతినిధి ఫాతి అల్ ఫద్ల్ మాట్టాడుతూ సూడాన్‌లోని ప్రజాస్వామ్య శక్తులపై మిలిటరీ దాడిని పార్టీ ఊహించిందని పేర్కొన్నారు. ఈ తిరుగుబాటును రాజకీయ కుతంత్రంగా కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హసన్ అభివర్ణించారు. చివరి రక్తపు బొట్టు వరకు దేశంలో ఇటువంటి చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ తిరుగుబాటును ఓడిరచేవరకు రాజకీయ సమ్మె, శాసనోల్లంఘన ఉద్యమాలకు పిలుపునిచ్చింది. అరబ్‌లీగ్ సూడాన్‌లోని తాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలకు రావాలని జనరల్ బుర్హాన్‌ను కోరింది. కమ్యూనిస్టులు అధికారాన్ని తక్షణమే పౌర ప్రభుత్వానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, టెలివిజన్, రేడియో ప్రధాన కార్యాలయాలపై దళాలపై దాడి చేయడంతో జర్నలిస్టులను పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకున్నట్లు సమాచార మంత్రిత్వశాఖ థృవీకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బ్రిటన్ ప్రధాన కార్యదర్శి రాబ్ గ్రిఫిత్స్ వాషింగ్టన్, లండన్ మిత్రదేశాలు సూడాన్‌లో తాజా పరిస్థితిని తీవ్రంగా గర్హించాయి.