లండన్ : బ్రిటన్‌కు చెందిన ఎంపీ డేవిడ్ అమేస్‌పై దుండగులు దాడిచేసి కత్తితో పొడిచి హతమార్చారు. ఎసెక్స్ లోని సౌత్ ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్ అమీస్(69) శుక్రవారం స్థానికంగా ఉన్న లీఅన్
సీలోని చర్చిలో వారాంతపు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఓ వ్యక్తి దాడిచేసి చాలాసార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. తీవ్రగాయాలపాలైన డేవిడ్ అమేస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందినట్లు స్థానిక పోలీసులు ధృవీ కరించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటాన స్థలంలో సౌత్ ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని థృవీకరించారు. ఇస్లామిక్‌తీవ్రవాదులే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాన బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ నేత డేవిడ్ అమీస్, 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. జంతు సమస్యలతోపాటు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా అమీస్ పోరాడారు. అమీస్ మృతిపై సహచర ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమీస్‌కు ఘన నివాళులర్పించారు. ఈ ఘటన అత్యంత భయంకరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీనేత కీర్ స్టార్మర్ అభివర్ణించారు.