వాషింగ్టన్: హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనీయే హత్యతో గాజాలో కాల్పుల విరమణకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇస్మాయిల్ హత్యతో పోరు మరింత తీవ్రరూపం దాల్చగలదని, సుదీర్ఘ కాలం సాగేందుకు వీలు ఉంటుందని గాజా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని గంటల్లోనే ఇస్మాయిల్ హత్యకు గురైనట్లు ఇరాన్ వెల్లడిరచింది. ఇస్మాయిల్ హనీయే హత్య వల్ల కాల్పుల విరమణకు ఉన్న అవకాశాలు సన్నగిల్లాయా అని విలేకరులు ప్రశ్నించగా దీని వల్ల ఫలితం ఉండదు అని బైడెన్ బదులిచ్చారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నేరుగా సంభాషిం చినట్లు తెలిపారు. ఈ హత్యతో తమకు సంబంధం ఉన్నట్లు నెతన్యాహు చెప్పలేదు కానీ హమాస్, హెజ్బుల్లాను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నట్లు వెల్లడిరచారు. ఇదిలావుంటే ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు 40వేల మంది పలస్తీనియన్లు చనిపోగా, 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇస్మాయిల్ హనీయే హత్య వెనుక తమ హస్తం లేదని అమెరికా స్పష్టంచేసింది.