సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ బిలియనీర్ యజమాని ఎలాన్‌మస్క్ దేశంలోని చట్టపరమైన తమ ప్రతినిధిని పేర్కొనడానికి నిరాకరించడంతో బ్రెజిల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ శుక్రవారం బ్రెజిల్‌లో ఎలోన్ మస్క్ నిర్వహించే ఎక్స్ ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో బ్రెజిల్‌లో ఎక్స్ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ అక్కడి టెలికాం శాఖ చర్యలు తీసుకుంది. ఆ దేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఇక్కడి ప్రజలకు ఎక్స్‌లోకి లాగిన్ అవడం సాధ్యం కావడం లేదు. బ్రౌజర్‌ను రీలోడ్ చేసి లాగిన్ అవ్వండి అంటూ పదేపదే సందేశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ నుంచి ఎక్స్ యాప్‌ను తొలగించడానికి బ్రెజిల్ న్యాయస్థానం డెడ్‌లైన్ విధించింది. ఈ చర్యతో ఎక్స్ లోని ఒక పోస్ట్‌లో మస్క్ అతన్ని దుష్ట నియంతు అని పేర్కొన్నారు.
మరోవైపు టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌కు న్యాయమూర్తి మోరాసే ఐదు రోజుల గడువు విధించారు. ఈలోపే వాటి ఆండ్రాయిడ్, ఐవోఎస్ అప్లికేషన్ల నుంచి ఎక్స్‌ను తొలగించాలని సూచించారు. అంతేకాదు వీపీఎన్ సాయంతో వ్యక్తులు లేదా వ్యాపారసంస్థలు ఎక్స్‌లో లాగిన్ అయితే 5,000 డాలర్ల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎక్స్ బ్రెజిల్‌లో న్యాయ ప్రతినిధిని ఏర్పాటు చేసేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
రాజకీయ లబ్ది కోసం నాశనం చేశారు : ఎలాన్‌మస్క్
అక్కడి న్యాయస్థానం తీరుపై ఎక్స్ యజమాని ఎలాన్‌మస్క్ స్పందిస్తూ ౌ ు వాక్ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజామోదంతో ఎన్నిక కాని న్యాయమూర్తి.. ఈ పునాదిని రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నాడు అని పేర్కొన్నారు.