విశాలాంధ్ర -విజయవాడ (క్రైం): విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీగా ఎన్ఎస్ వీకే దుర్గారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఉన్న దుర్గారావును వెస్ట్ జోన్ ఏసీపీగా నియమిస్తూ డీజీపీ ద్వరాకా తిరుమలరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గారావు గతంలో విజయవాడ టూ టౌన్ సీఐగా, ట్రాఫిక్-3 స్టేషన్ సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ జోన్ పరిధిలోని టూ టౌన్ స్టేషన్ సీఐగా పని చేసినప్పుడు మంచి పెరు పొందారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు నేరాల నియంత్రణ కోసం తనదైన శైలిలో పని చేసి అందరి మన్ననలు పొందారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ దుర్గారావుకు పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.