. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ దేవరకొండ జయకుమార్
విశాలాంధ్ర – విజయవాడ : అవసరాలకు తగట్టుగా ఎన్నో వినూత్న పథకాలను ఆవిష్కరించినట్లు విజయవాడ మాచవరం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ దేవరకొండ జయకుమార్ అన్నారు. బ్యాంక్ ప్రాంగణంలో ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు వీటిని వినియోగదారులకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఖాతాదారులకు కూడా ఇండియన్ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫీక్స్‌డ్ డిపాసిడ్‌లో ఇండ్ సూపర్ పథకం కేవలం 400 రోజుల్లో సూపర్ సీనియర్ సీటిజన్లకు 8 శాతం, సీనియర్ సిటీజన్లకు 7.75, సాధారణ జనాలకు 7.25 శాతం వడ్డీ అందిస్తుందన్నారు. ఇండ్ సుప్రీమ్ పథకం 300 రోజలకు సూపర్ సీనియర్ సిటీజన్లకు 7.80, సినియర్ సిటీజన్లకు 7.55, సాధారన ప్రజలకు 7.05శాతం వడ్డీ రేటు కలిగి ఉందన్నారు. ఈ పథకం సెప్టెంబర్ 30వతేదీ వరకు చెల్లుతుందన్నారు. ఇటీవల రాజీవ్ నగర్‌కు చెందిన లీలాకృష్ణకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి స్కీమ్‌లో రూ.436 చెల్లించారని, ఇటీవల అతను మరణిస్తే రూ.2లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందన్నారు.
ఇక డీజిటల్ ఫిక్సిడ్ డిపాజిట్ అందుబాటులో ఉందన్నారు. కేవలం 2నిముషాల్లో మొబైల్ యాప్, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డిజిటల్ రసీదుతో డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ప్రధాన మంతి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సామాజిక భద్రత కోసం ఖాదాతారులు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇండియన్ బ్యాంక్‌లో హోమ్ లోన్స్, పర్సన్ లోన్స్, వెహికల్స్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సైబర్ నేరాల పై ఖాతారులు అమ్రత్తంగా ఉండాలని చెప్పారు. బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, ఏటీఎం పిన్‌తో పాటు లావాదేవీల వివరాలు ఎవరికీ ఇవ్వద్దన్నారు. బ్యాంక్ నుండి ఎటువంటి ఓటీపీ రావని, ఎవరికి కూడా తమ ఓటీపీ నంబర్ చెప్పకూడదని ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దీప్తీ, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఎస్.నిర్మలా, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు యం.రామకృష్ణ, వి.వెంకటేశ్వరరావు, వై.లక్ష్మీ నారాయణ, కే.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.