asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

అనాధ పిల్లలకు ఉచిత విద్య


కరస్పాండెంట్ నరేష్ ఆచారి

సమావేశంలో మాట్లాడుతున్న కరస్పాండెంట్ నరేష్ ఆచారి

విశాలాంధ్ర – ఆస్పరి : గత రెండేళ్లుగా సామాన్య విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దిన నారాయణ ప్రైమ్ స్కూల్లో తల్లిదండ్రు లేని విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆచారి తెలిపారు. శుక్రవారం స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ నరేష్ ఆచారి మాట్లాడుతూ అన్ని వసతులు, సౌకర్యాలతో పాటు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడంలో నారాయణ ప్రైమ్ స్కూల్ కు పెట్టిందే పేరు అన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే అందులో ఒకరికి ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా గురుకుల, నవోదయ వంటి పోటీ పరీక్షలలో ఉత్తమ మార్కులు మరియు సీట్లు సాధించిన మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా విద్య మరియు గురుకుల నవోదయ కు ప్రత్యేక కోచింగ్, ఉదయం యోగ, క్రీడా వంటి వస్తులు మా పాఠశాలలో ఉన్నాయని, దూర ప్రాంతా విద్యార్థులకు బస్సు సౌకర్యం మరియు హాస్టల్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ఈ ఈ సమావేశంలో ఉపాధ్యాయ బృందం దీప్తి, చంద్రకళ, లావణ్య, వరలక్ష్మి, సౌమ్య, గాయత్రి, అంజనమ్మ, శ్రీదేవి, పద్మావతి, నిర్మల, ఈశ్వర్, బాలు, సంజన, నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img