విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రాప్తాడులో జరిగిన సీఎం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే , తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య,మండల అధ్యక్షులు సోమన్న,రాష్ట్ర నాయకులు భీమన్న, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణపై వైసీపీ గూండాలు దారుణంగా కొట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా చలామణి అవుతున్న పత్రిక జర్నలిస్టులపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడడం అమానుషమన్నారు. తక్షణమే శ్రీకృష్ణ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల కార్యదర్శి రామన్న, తాలూకా సహాయ కార్యదర్శి ఈరన్న, మండల కోశాధికారి నారాయణ, పాత్రికేయులు మల్లికార్జున, ఏలియస్, లింగమూర్తి, రాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, టిడిపి నాయకులు మీసేవ ఆంజనేయ, దశరథరాముడు, సుధాకర్, సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు.