-STU రాష్ట్ర ఉపాధ్యక్షడు బి.వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న 117 జీవోను వెంటనే రద్దు చేయాలని STU రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం
మండలం లో రాష్ట్రోపాద్యాయ సంఘం (STU) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా హనుమాపురం, పెద్దకడ బూర్ ఉన్నత పాఠశాల, కల్లుకుంట, కంబదహల్, గవిగట్టు, బసలదొడ్డి ప్రాథమిక పాశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సమస్యలు సేకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతో అమలు చేసిన పాఠశాల విలీనం వల్ల ప్రాథమిక పాఠశాలలు బలహీన పడిపోయి కనుమరుగయ్యే అవకాశం ఉందని, కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి 117 జీవో రద్దు చేయాలని కోరారు.
ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే అమలు చేయడం వల్ల అనేకమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠశాల మధ్యలో విడిచిపెట్టి డ్రాపౌట్ట్లుగా మారుతున్నారని, దీనిని నివారించుటకు ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంను, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం బోధన అమలు చేయాలని కోరారు.
తల్లికీ వందనం పథకంను ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు.
12వ PRC అమల్లో జాప్యాన్ని నివారించాలని, వెంటనే 40 శాతం IR ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉపాద్యాయ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఒత్తిడి కలుగజేసే యాప్ లను, బోధ నేతర పనులను తొలగించాలని నారు.
వెంటనే నూతన ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యారంగ సమస్యల గురించి చర్చించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర పూర్వ కార్యదర్శి ప్రసన్నరాజు, STU పెద్దకడబూర్ మండల అధ్యక్షుడు తులసిరాం, ప్రధానకార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ మెంబెర్స్ రాజశేఖర్, దామోదర్, షాబీర్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.