విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : సమయపాలన పాటించని బ్యాంకు మేనేజర్ రంగప్ప పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులోని ఖాతాదారులపై మేనేజర్ రంగప్ప దురుసుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సెలవుల పేరుతో బ్యాంకుకు ఇస్టానుసారంగా డుమ్మా కొడుతున్నారన్నారు. ఖాతాదారులు ఎవరైనా బ్యాంకులో ఖాతా సమస్యలపై వెళితే రేపు రా ఎల్లుండి రా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులో రుణాలు కావాలన్నా రెకమెండేషన్ పెట్టుకొని దలారులతో లావాదేవీలు నడుపుతున్న బ్యాంకు మేనేజర్ రంగప్ప పై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, భాషా, వీరాంజనేయులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.