విశాలాంధ్ర – ఆదోని : విద్యార్థి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రతి ఏడాది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదోని జోనల్ స్థాయి స్థాయి ఇండోర్, ఔట్డోర్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా నేడు ఆదివారం మల్లికార్జున విద్యాలయ హై స్కూల్లో ఇండోర్ గేమ్ లో నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ రెడ్డి, డాక్టర్ సైఫుల్ల తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ అనగా నేడు ఆదివారం ఇండోర్ గేమ్స్ ను మల్లికార్జున విద్యాలయ హై స్కూల్ లో, ఈనెల 22 వ తేదీ అవుట్డోర్ గేమ్స్ ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదోని జోనల్ స్థాయి పోటీల్లో 50 పాఠశాలల నుండి ఆరవ నుండి పదవ తరగతి చదివే 3000 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు. ఇండోర్ ఆటలు పోటీల్లో చెస్, రూబిక్ క్యూబ్, డ్రాయింగ్, ఎలిక్యూషన్ , క్విజ్, అవుట్డోర్ ఆటల పోటీల్లో బాలురుల కోసం ఫుట్బాల్ , బాస్కెట్బాల్, త్రో బాల్, కబడ్డీ, డార్జ్ బాల్, లాంగ్ జంప్ , షాట్ పుట్ , జావిలిన్ త్రో, బాలికల కోసం త్రో బాల్ , కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, లాంగ్ జంప్, షాట్ పుట్ తో పాటు పరుగు పందాలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేడు జరిగే ఇండోర్ ఆటల పోటీలలో దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు భోజన వసతి సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు భోజన వసతి కల్పించేందుకు సహాయ సహకారాలు అందించిన పట్టణంలోని వివిధ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక దృక్పథంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను జనాల్లో ప్రచురిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ సభ్యులు జీవన్ సింగ్, భరత్ షా, సునీల్ రెడ్డి , యూత్ యాక్టివిటీస్ ఇంచార్జ్ సాబీర్ అహ్మద్, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.