విశాలాంధ్ర – ఆదోని : ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల విద్యార్థినీలకు అవగాహన కల్పించడం జరిగిందని ఆదోని ట్రాఫిక్ సిఐ ఘంటా సుబ్బారావు తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, సోషల్ మీడియా ప్రభావం, రోడ్లు భద్రత, సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై కళాశాల యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థులు పాటించవలసిన నియమాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధన తూచా తప్పకుండా పాటించాలని, విద్యార్థిని విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులతో పాటు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.