విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ సమితి సభ్యులు రెడ్డి ఇర్ఫాన్ పటేల్ ను తల్లిదండ్రులు ఉర్దూ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందజేసి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.