లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్
విశాలాంధ్ర – కర్నూలు సిటీ :దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ -హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటరమణ కాలనీలో కె. ఎన్ .ఆర్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు. డా. రాయపాటి శ్రీనివాస్, లయన్ గోపీనాథ్ లు జాతీయ జెండా, లయన్స్ ఫ్లాగ్ లను ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. 15 తేదీన ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ