విశాలాంధ్ర – ఆదోని : కర్నూలు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కే భూపాల్ చౌదరి 51వ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం అన్న క్యాంటీన్ లో 500 మందికి ఉచితంగా భోజనం టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఇండియా కూటమి వంద రోజుల ప్రభుత్వం లో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు తోనే సాధ్యమని అన్నారు. విజయవాడలో జరిగిన విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడి వారికి అండగా నిలిచి దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, బుద్ధారెడ్డి , వెంకటేష్, సాదుల్లా నాగరాజ్ ఫోటోగ్రాఫర్ వెంకటేష్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.