విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి హేమలత సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు ఖరీఫ్ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ఉద్యాన శాస్త్రవేత్త మౌనిక, రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి హేమలత పాల్గొని రైతులకు మిరప, పత్తి, వరి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై క్షేత్ర సందర్శన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మిరపలో తామర పురుగు వలన ఆకుల పైకి ముడుచుకొని పోయి పైరు ఎదుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు . తామర పురుగు నివారణకు 10 నీలం రంగు జిగురట్టలను పెట్టుకోవాలని మరియు పీప్రో నిల్ + ఇమిడా క్లోరోపిడ్@0.2 గ్రామ్ 1 లీటర్ కి లేదా స్పైనోటారం@ 0. 9 మిల్లీలీటర్లు 1 లీటర్ కి కలిపి మార్చి మార్చి పిచికారి చేయాలని వాటితోపాటు వేప నూనె 10000 పిపిఎం 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ కి కలుపుకొని పిచికారి చేసుకోవడం వలన పురుగు గుడ్డు దశను నివారించ వచ్చునని సూచించారు.
ప్రత్తి పంటలో తెల్ల దోమ పచ్చ దోమ నివారణకు ఫ్లూనికామైడ్ 0.3 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అలాగే ఎకరాకు 30 కిలోల యూరియా 20 కిలోల పొటాష్ వరుసల మధ్యలో చల్లుకోవటం వలన మొక్క ఎదుగుదలకు కాయ పయోగపడుతుందని తెలిపారు.
పచ్చ దోమ, తామర పురుగు నివారణకు ఎకరాకు పది చెప్పున పసుపు లేదా నీలం రంగు అట్టలను అమర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ఇందు, శ్వేత, రాహుల్ కళ్యాన్ , గ్రామ పెద్దలు జగన్నాథ్ రెడ్డి, విజయకుమార్, సుధాకర్ రెడ్డి, ఈరన్న , చంద్రశేఖరయ్య, లోకదాస్ గ్రామ రైతులు పాల్గొన్నారు.