విశాలాంధ్ర – ఆదోని : మండల పరిధిలోని పెద్దతుంబలం గ్రామం జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్, హిందీ ఉపాధ్యాయురాలు నయన కుమారి తెలిపారు. హిందీ దినోత్సవ సందర్భంగా హైస్కూల్లో విద్యార్థిని, విద్యార్థులు స్వచ్ఛ భారత్ పాటలు, డాన్సులు, నాటికల ద్వారా హిందీ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి 2024 ఎగ్జామ్స్ హిందీలో జడ్పీ హైస్కూల్, పెద్ద తుంబలం నుండి ఎస్.ఎండి. ఫరూక్ నూటికి 99 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ టాపర్ గా నిలవడంతో హిందీ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థికి హెడ్మాస్టర్ వెంకటేష్ చేతుల మీదుగా మెమొంటో మరియు అప్రిసియేషన్ సర్టిఫికెట్ హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి. డి. నయన కుమారి అందజేశారు. అదేవిధంగా హిందీలో టాపర్స్ అయిన విద్యార్థులకు మెమెంటోస్ మరియు సర్టిఫికెట్స్ ఇతర అధ్యాపకులచే శ్రీమతి. నయన కుమారి, హిందీ టీచర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ భాష అయిన హిందీ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, హిందీ యొక్క గొప్పతనం గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. శనివారం సెకండ్ సాటర్డే ఉండడంవల్ల ఒకరోజు ముందుగా హిందీ దినోత్సవ వేడుకలను హైస్కూల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వారు తెలిపారు.