విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనాథ్ ను గురువారం జనసేన మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన మండల నాయకులు జిలకర గణేష్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి సహకరించాలని, మండలంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికై గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి తహసిల్దార్ సానుకూలంగా స్పందిస్తూ గొడవలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే మండలంలో విద్య, వైద్యం, అభివృద్ధి, పలు అంశంలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మండల అభివృద్ధికై తన వంతు బాధ్యతగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆయన తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజు, సుభాన్, హనుమేష్, తిమ్మప్ప, ఐటీ కోఆర్డినేటర్ గణేష్ లు పాల్గొన్నారు.