విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా): మండల పరిధిలోని పుటకలమర్రి గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కోఆర్డినేటర్ ఆనంద్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షమీల, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఫణీంద్ర లు పాల్గొని కబడ్డీ, కోకో ఆటలలో పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అండర్14 మరియు అండర్ 17 బాల, బాలికల క్రీడా పోటీలు వాలీబాల్, కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని, విద్యార్థులు నియోజకవర్గస్థాయిలో ఆడటం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు జాషువా ఫౌండేషన్ అధ్యక్షుడైన దేవేంద్రయ్య, మాజీ సర్పంచ్ నాగరాజు లు భోజన వసతి కల్పించడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం ఫిజికల్ డైరెక్టర్స్ లు రంగస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, లతీఫ్, విజయ్ కుమార్, రామంజి, అంజి, రాజేశ్వరి, మహేంద్ర, రాము విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.