విశాలాంధ్ర – ఆదోని : మునిసిపల్ హైస్కూల్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటిల్లో అండర్-14 విభాగం లో నేషనల్ స్కూల్ విద్యార్థినులు మండల స్థాయిలో విజేతలుగా నిలిచారని పాఠశాల అధినేత గోపాల్ రెడ్డి, పీఈటి రవికుమార్ తెలిపారు. గురువారం విజేతలుగా నిలిచిన నిలిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల అధినేత గోపాల్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలని అన్నారు. వ్యాయమా ఉపాధ్యాయులు రవి, గోవిందరాజుల చేసిన కృషి తోనే విద్యార్థులు విజేతలుగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.