విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేద వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వరం లాంటిదని టిడిపి నాయకులు ఎంజీ నరసన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలుగొట్ల లక్ష్మన్న, గౌళ్ల హనుమంతరెడ్డి, నల్లారెడ్డి, కల్లు లక్ష్మన్న, డోలు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.