విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న బీ. ఆర్. నవీన్ కుమార్ జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. కోసిగిలో ఇటివల జరిగిన ఎస్జీఎఫ్ అండర్ – 14 విభాగంలో తాలూకా స్థాయి ఖోఖో పోటీల్లో పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థి బీఆర్ నవీన్ కుమార్ ప్రతిభ చాటి జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. దీంతో మంగళవారం పాఠశాల డైరెక్టర్ రంగారెడ్డి, కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు జె పుల్లయ్య, రామకృష్ణ, అశోక్, పీఈటీ అంజీ జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన బీఆర్ నవీన్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాస్థాయి ఖోఖో పోటీలలో రాణించి పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.