విశాలాంధ్ర – ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా కైరిప్పల రమేష్ ఎన్నికయ్యారు. సోమవారం కర్నూలు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏఐవైఎఫ్ జిల్లా సమితి సమావేశంలో ఎన్నిక జరిగినట్లు రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువత తో కలిసి పాలకవర్గాలపై సమరశీల పోరాటాల నిర్వహిస్తానన్నారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా రథసారథి సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్యకు, అలాగే ఏఐవైఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.