విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : భారీ వర్షాల వల్ల పాడైపోయిన రోడ్లను వేయాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షాలు కారణంగా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయన్నారు. అలాగే డ్రైనేజీలు కూడా పూడికతో పెరుకోపోయాయన్నారు. వీటిని శుభ్రం చేయించాలని మండల ఎంపీడీఓ కు, పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు ఎన్నిమార్లు విన్నవించుకున్నా కూడా సీటుకే పరిమితమైతున్నారు తప్ప ఏ పని కూడా చేయడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సీటుకే పరిమితం కాకుండా మండలంలోని వివిధ గ్రామాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలకు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, తిక్కన్న, హనుమంతు , సుభాన్, రామాంజనేయులు, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.