విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం మండల పరిధిలోని చిన్నతుంబలం, కల్లుకుంట, రంగాపురం, తారాపురం, చిన్నకడబూరు, గంగులపాడు,కంబళదిన్నె ,కంబదహాల్ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డికి నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను అందజేశారు. చిన్నతుంబలం – 23,650, కల్లుకుంట – 23500,రంగాపురం – 22600, చిన్నకడబూరు – 20,500, కంబదహాల్ – 16000, కంబలదిన్నె-12000, తారాపురం – 10000,గంగులపాడు – 6000 రూపాయల నగదును రమాకాంతరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులై కట్టు బట్టలతో ఉన్నారని తెలిపారు. వరద బాధితులకు తమ వంతుగా అండగా నిలుస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వరద బాధితులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరేష్ గౌడ్, శివ, నరసన్న, నరసప్ప, ఏక్ హనుమంతు నర్సింహులు, మహాదేవ, లక్ష్మన్న, చంద్ర, పక్కిరెడ్డి, సోమన్న, భీమరాయుడు, తాయన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.