జె.ఎస్.పి మండల కన్వీనర్ అరవింద్
20 వేలు అందజేసిన జనసైనికులు
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రానికి చెందిన జనసైనికుడు మహానంది తల్లి (పెద్ద సంజమ్మ) అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఆలూరు తాలూక జనసేన పార్టీ ఇంచార్జి వెంకప్ప ఆదేశాల మేరకు మండల కన్వీనర్ అరవింద్, మండల జనసేన నాయకులు ఉదయం మృతురాలి పార్థవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి ఇద్దరు కుమారులను ఓదార్చి జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని వారికి మనో ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయంగా రూ 20 వేల రూపాయలను అందించడం జరిగింది. అలాగే భవిష్యత్ లో వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. జన సైనికుడు మహానంది కుటుంబానికి అండగా ఉంటాం అంటూ విరాళాలు అందించిన జనసైనికులకు, అభిమానులకు పేరు పేరున అభనందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పూజారి శివ, జనసేన మండల నాయకులు పూజారి శ్రీనివాసులు, రంజిత్, మహేష్, ప్రసాద్, విష్ణు, మధు, జనసైనికులు పాల్గొన్నారు.