పుదుచ్చేరి : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి తాను ఏర్పాటు చేయ బోయే మంత్రివర్గంలో చేర్చుకోబోయే వారి పేర్లతో ఓ జాబితాను సిద్ధం చేశారు. దీనిని బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు. గవర్నర్ ముఖ్యమంత్రి సిఫారసులను ఆమోదించి తదుపరి ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తారు. బీజేపీ మొదట్లో తన ఎమ్మెల్యేలలో ఒకరిని ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబట్టింది. ఆ తర్వాత మెత్తబడి అసెంబ్లీ స్పీకర్ పోస్టుతో సరి పెట్టుకుంది. ఈ కారణంగా కేంద్రపాలిత పుదుచ్చేరిలో బీజేపీ`ఏఐఎన్‌ఆర్‌సీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గ ఏర్పాటుకు నెల ఆలస్య మైంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంత్రుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, అక్కడి నుంచి రాష్ట్రపతికి ఆమోదానికి పంపుతారు.