Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

తెలంగాణ కవితా వైభవం

(పాల్కురికి నుండి గద్దర్‌ వరకు)

‘తెలంగాణ భాషా మాండలికమని, ఇది రాయరాద’ నే సవాలుకు వందేండ్ల కిందనే జవాబు దొరికింది. నాటి గోలుకొండ కవుల సంచిక నుంచి, ఇప్పటివరకూ వందలాది పుస్తకాల్లో తెలంగాణ కవులు రాసిన కవిత్వం, భాషా, సామెతలు, జాతీయాలు, నుడికారాలు మొదలైనవి విరివిగా చోటుచేసుకున్నయన్న దానికి ఇటీవలె ఆచార్య అనుమాండ్ల భూమయ్య రాసిన ‘తెలంగాణ కవితా వైభవం’ (పాల్కురికి నుండి గద్దర్‌ వరకు) అనే పుస్తకం గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ కవితా వైభవాన్ని, సాహిత్య పరిమళాల్ని ఇది బయటి ప్రపంచానికి భీకర స్వరంతో వినిపించిందని చెప్పాలి. ఈ గ్రంథ రచయిత ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు వారధిగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరు. సుప్రసిద్ధ అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, గొప్ప ఉపకులపతిగా పేరు గడిరచారు. ఆచార్య భూమయ్య ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా చాలా సరళంగా సుబోధకంగా సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా రాస్తారు.
‘తెలంగాణ కవితా వైభవం’ అనే పేరుతో 380 పేజీలా ఉద్గ్రంథాన్ని ఆచార్య భూమయ్య 2023 సెప్టెంబర్‌లో ప్రచు రించారు. ఇందులో పాల్కురికి నుండి గద్దర్‌ వరకు గల కావ్య, కవితా విశేషాల్ని తెలియజేశారు. ప్రధానంగా పాల్కురికి సోమ నాథుడిపై 8, కొఱవి గోపరాజుపై 3, బమ్మెర పోతనపై 5, శేషప్ప గురించి 1, గోలకొండ కవులపై 4, కాళోజి నారాయణరావుపై 1, దాశరథి కృష్ణమాచార్యపై 2, డా. సి. నారాయణరెడ్డిపై 5, డా. పల్లా దుర్గయ్యపై 3 , పొట్లపల్లి రామారావుపై 1, గద్దర్‌ గురించి 2 అన్ని కలిపితే 35 వ్యాసాలున్నాయి. ప్రతీదీ దేనికదే ప్రత్యేకమైనదని చెప్పాలి. రచయిత సందర్భోచితంగా తెలంగాణ కవితా వైభవాన్ని వేనోళ్ళ కొనియాడారు. ప్రాచీన సాహిత్యంలోని జఠిలమైన పద్యాల విశేషాల్ని బాగా అర్థమయ్యేట్లు వివరించారు. వ్యాసాల్లో పరిశోధన, తులనాత్మకు చక్కని స్థానం కల్పించారు. పాఠకులు తప్పక చదవవలసిన పుస్తకమిది.
ఈ గ్రంథంలోని వ్యాసాల్లో కవులు వారి రచనా విశేషాల్ని కూలంకషంగా పేర్కొంటూ…వాటి ప్రత్యేకతల్ని ఎంతో రమణీయంగా చర్చించారు. ఓ మూడు నాలుగు వ్యాసాల్లో సంభాషణాత్మక పద్ధతి ఇట్టే ఆకర్షిస్తుంది. వేదకాలంలో ఈ విధానం బహుళ ప్రాచుర్యంలో ఉండేది. గురుకులాల్లో గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ వల్ల కష్టమైన అంశాలు కూడా సులభంగా బోధపడేవి. తెలుగు సాహిత్య విమర్శలో బహుశా ఈ పద్ధతిని వీరే ప్రవేశం కల్పించారనిపిస్తోంది. ‘పాల్కురికి సోమనాథుడు, కొఱవి గోపరాజు, పోతన, శేషప్ప ప్రాచీన కవులు. గోలకొండ కవులు, కాళోజి, దాశరథి, సి. నారాయణరెడ్డి, పల్లా దుర్గయ్య, పొట్లపల్లి రామారావు, గద్దర్‌ ఆధునికులు, వీరు కావ్య కీర్తిశేషులు. ప్రాచీన, ఆధునిక కవులు మొత్తం పదకొండు. పాల్కురికి సోమన మొదలుగా గద్దర్‌ వరకు గల కవుల కవితా విశేషాలకు సంబంధించిన ఈ వ్యాస సంపుటికి ‘తెలంగాణ కవితా వైభవం’ అని పేరు పెట్టాను. 800 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న ప్రాచీన, ఆధునిక తెలంగాణ కవుల కవితా విశేషాలు, సామాజికాంశాలు తెలుసుకోవటానికి ఈ వ్యాస సంపుటి కొంతైనా ఉపకరిస్తుందను కొంటున్నాను.’ అని ఆచార్య భూమయ్య ఈ పుస్తకానికి రాసిన ‘నా మాట’ లో పేర్కొన్నారు. అసలు కొన్ని విషయాలే కాదు చాలా అంశాల్ని రచయిత ఈ గ్రంథం ద్వారా ప్రస్ఫుటం చేశారు.
డా. బడిగె ఉమేశ్‌ , 9494815854

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img