Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

నీడ చూపించిన అసలు చిత్రం

విశ్వ విఖ్యాత మేధావి, న్యాయ కోవిదుడు, దళితోద్యమ కాగడా డా.అంబేద్కర్‌ జీవిత చరిత్రలు చాలానే వచ్చాయి. అంబేద్కర్‌ మీద జరిగినంత చర్చ చాలా తక్కువమంది మీదే జరిగి ఉంటుంది.
ఆయన రెండవభార్య సవిత అంబేద్కర్‌ మరణించిన 34  సంవత్సరాలకు ‘‘డా. అంబేద్క రాంచ్య సహవాసత్‌’’ గ్రంథం మరాఠీలో వెలువరించారు. ఇది పేరుకు సవిత జీవిత చరిత్ర లాంటిదే అయినా అందులో సర్వత్రా అంబేద్కర్‌ ప్రస్తావనే ఉంటుంది. మరాఠీలో ఈ గ్రంథం ఇంగ్లీషులో ‘‘బాబా సాహెబ్‌: మై లైఫ్‌ విత్‌ అంబేద్కర్‌’’ రూపంలో రావడానికి 31ఏళ్లు పట్టింది. నదీం ఖాన్‌ సవిత మరాఠీలో రాసిన గ్రంథాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. 
అంబేద్కర్‌ మొదటి భార్య 1935లో మరణించారు. ఆ తరవాత 1948లో అంబేద్కర్‌ సవితను పెళ్లి చేసుకున్నారు. అప్పటికి అంబేద్కర్‌కు 57 ఏళ్లు. సవితకు 39 ఏళ్లు. సవిత వృత్తిరీత్యా డాక్టర్‌. ఆమె అంబేద్కర్‌కు కూడా వైద్యంచేశారు. ఆ పరిచయమే పెళ్లికి దారితీసింది. ఇద్దరి మధ్య వయసు తేడా 18ఏళ్లు. సవిత అంబేద్కర్‌ను పెళ్లాడే నాటికి అంబేద్కర్‌ కుమారుడు యశ్వంత్‌ అంబేద్కర్‌కు 16 ఏళ్లు. అంటే అంబేద్కర్‌ రెండో పెళ్లి చేసుకున్న సవితకు, కొడుకు యశ్వంత్‌కు మధ్య వయసులో తేడా దాదాపు మూడేళ్లు.
డా.సవితను పెళ్లాడాలన్న ఆకాంక్ష మొదట డా.అంబేద్కర్‌ నుంచే వచ్చింది. ఆమె వెంటనే ఒప్పుకోలేదు. రెండోసారి ప్రతిపాదించిన తరవాత సరేనన్నారు.
1948 ఏప్రిల్‌ 15వ తేదీన ఇద్దరికీ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ముందు నుంచే సవిత అంబేద్కర్‌కు చికిత్స చేస్తున్నారు. పెళ్లయిన తరవాత అంబేద్కర్‌ ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకున్నారు. అంబేద్కర్‌కు రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి అనేక సమస్యలు ఉండేవి. డా.సవిత చికిత్స, పరిచర్యే లేకపోతే అంబేద్కర్‌ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అంత చురుకుగా, సమర్థంగా పని చేయగలిగేవారు కాదేమో.
అంబేద్కర్‌ జీవితంలో రెండవ భార్య సవిత పాత్ర చాలా కీలకమైంది. తన జీవిత చరిత్ర రాయాలని సవిత ప్రయత్నించినా అది చివరకు అంబేద్కర్‌ జీవిత చరిత్రలాగే కనిపిస్తుంది. అయితే అంబేద్కర్‌కు వైద్యం చేసినప్పుడు, పెళ్లి చేసుకున్న తరవాత, ఆయన ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమైనప్పుడు సవిత తన ప్రత్యేక వ్యక్తిత్వానికి భంగం కలగనివ్వలేదు. 1956లో 65వ ఏట అంబేద్కర్‌ మరణించిన తరవాత ఆమె అనేక నిందలు మోయాల్సి వచ్చింది. ఆమె అంబేద్కర్‌కు విషం ఇచ్చి చంపారు అన్న అసత్య ప్రచారాలు ముమ్మరంగా జరిగాయి.
సామాజిక కార్యకర్తగా సవితకు ప్రత్యేకత ఉంది. నిందలపర్వం ముగిసిన తరవాత ఆమె మళ్లీ సామాజిక కార్యకలాపాల్లో మునిగిపోయారు. 94ఏళ్ల పాటు నిండైన జీవితం గడిపారు. సవిత కుటుంబం అభ్యుదయభావాలు గలది. ఆమె ఇంట్లో అప్పటికే ఆరుగురు కులాంతర వివాహాలు చేసుకున్నారు కనక అంబేద్కర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆ బ్రాహ్మణ కుటుంబం ఏ మాత్రం అడ్డు చెప్పలేదు.
తన ఆత్మకథ పేర అంబేద్కర్‌ కథ చెప్పడంలో కేవలం తన దృక్కోణం నుంచి మాత్రమే చెప్పలేదని, అంబేద్కర్‌తో కలిసి జీవించినప్పుడున్న అనుభవాలు, ఆయన మరణం తరవాత భరించిన అగ్నిపరీక్షలు కూడా చెప్పాలనుకున్నాను అని సవిత చెప్పారు.
పెళ్లి కాకముందే అంబేద్కర్‌ సవితకు లేెఖలు రాసేవారు. ఈ లేఖల వివరాలను సవిత ఈ గ్రంథంలో వెల్లడిరచారు. సాధారణంగా ఇలా వ్యక్తిగతమైన ఉత్తరాలలోని అంశాలు బయటపెట్టేవారు తక్కువే. అంబేద్కర్‌ రాసిన ఉత్తరాల నిండా సవిత మీద అపారమైన అనురాగం కనిపిస్తుంది. సవితను ఆయన ఎంతగా ఇష్టపడ్డాడో, ఆ లేఖల్లో ఎంత గాఢమైన భావుకత ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మేధోపరంగా వారిద్దరి మధ్య సామ్యం ఉండేది. ఇద్దరూ కలిసే బౌద్ధ మతం స్వీకరించారు. అంబేద్కర్‌ ఆరోగ్య పరిరక్షణే తన జీవితాశయం అన్నట్టుగా సవిత ప్రవర్తించారు. ఆమె కారణంగా తన ఆయుర్దాయం కనీసం పదేళ్లు పెరిగింది అని అంబేద్కర్‌ స్వయంగా చెప్పారు.
తన జీవిత అంత్య ఘడియల దాకా సవిత అంబేద్కర్‌ మార్గాన్నే అనుసరించారు. సవిత అసలు పేరు శారద. పెళ్లైన తరవాత సవితగా మార్చు కున్నారు. కానీ అంబేద్కర్‌ మాత్రం శారు అనే అనేవారు.
చాలామంది పురుషుల విజయాల వెనక వారి జీవిత సహచరుల తోడ్పాటు, కొన్ని సందర్భాలలో త్యాగమూ ఉంటుంది. సవిత తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండానే అంబేద్కర్‌కు నీడలా వ్యవహరించారు. సత్యం తెలుసుకోవాలనుకునే వారు డా. సవిత లాంటి ఆత్మ కథలు చదివితే అంబేద్కర్‌ గొప్పతనం మరింత స్పష్టంగా తెలిసి వస్తుంది. 

గొప్ప వ్యక్తులుగా వెలిగిన వారి వెనక నీడలా అనుసరించిన వారి తోడ్పాటు, నిబద్ధత ఎంత గహనమైనవో ఇలాంటి గ్రంథాల వల్ల అర్థం అవుతుంది. గొప్ప మనుషుల విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది అన్నది నానుడి. ఈ మాట డా. సవిత విషయంలో అక్షరసత్యం. ఆవిడ నీడగా మిగిలిపోకుండా సొంత వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలిగారు. నీడగా ఉంటూనే అంబేద్కర్‌ వ్యక్తిత్వం ఎంత నిఖార్సైందో చూపించారు.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img