మట్టీ…మనుషులు
రెండూ అనుసంధానమే
పంట పండిరచేటప్పుడు
పాదముద్రలై కదిలేటప్పుడు
కాలధర్మంలోకి ఒలికేటప్పుడు
మట్టిని ఎద్దేవా చేయకూ
మట్టిలో
మాణిక్యాలుండొచ్చు
మృత కళేబరాలుండొచ్చు
మట్టి అనేకనేక
మూలకాల సమాహారం
మట్టి మనలో
పరస్పర పూరకం
జీవం
ఎప్పటికైనా నిర్జీవమే
బతుక్కు భరోసాన్నిచ్చేవన్నీ
నిర్జీవాలే…
అవే మనిషిని హతమార్చే వరకూ..
చలామణీ అవుతుంటాయ్
మలినం మనసుకు
లేకుండా చూసుకోవాలి
మట్టి.. విత్తును
మొలకెత్తించి ప్రాణం పోస్తుంది
మట్టి మానవ మనుగడకు
మహా భూమిక
అంతిమంగా..
నువ్వూ నేనూ మనందరమూ
ఎప్పుడో ఒకప్పుడు
మట్టిలో ఐక్యం కావల్సిందే
మట్టి ఇప్పుడు
సర్వంతర్యామి..!
డా. కటుకోరa్వల రమేష్,
సెల్: 9949083327