Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

యువతకు ఆదర్శం ఈ నవల

రచయిత తమ పనిలో తాము నిమగ్నమై ఉంటారు. నవల గుర్తింపు కోసం తాను ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. అటువంటి ఈ నవల తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారం అందుకోవడం ద్వారా తెలంగాణ భాషకు,యాసకు పట్టం కట్టినట్లైంది. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన విధానంలో తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గం అనుసరించిన తీరు తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణమని చెప్పవచ్చును.
మరణమెప్పుడూ శూలంతో కుచ్చిన వేదనే… మరణాన్ని మరల మరల అనుభవించిన నాకు, చిగురించడం కూడా తెలిసింది. ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ నవల చదువుతున్నప్పుడు రచయిత ఎన్ని బాధలు, కష్టాలు, అవమానాలు భరించినారు, ఎన్ని అగచాట్లు పడ్డారనేది మనం అర్ధం చేసుకోవచ్చు. నవల పేరులో స్పష్టంగా వారి జీవితాన్ని మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్లకు ఉపేందర్‌ వాడిన స్వచ్ఛమైన తెలంగాణ పదాలు, భాష, యాస అర్ధం అవుతది. ఈ నవల మాత్రం పుట్టిన ఊరు సుద్దులను, ఆచారాలను, కులవృత్తులను పద్ధతులను జీవింపచేస్తుంది. చెరువులోని నల్లరేగడి మట్టిని, ఎండాకాలంలో తవ్వి, ఎడ్ల బండిలో తీసుకెళ్ళి, పొలాల్లో, చెలకల్లో వేసి, ఎరువుగా వాడుతారు. అలా చెరువులు తవ్వగా ఏర్పడే గుంతల్ని కోపులంటారు. అందులో కొన్ని నీళ్ళు నిలబడి, పశువులకి దాహం తీర్చడానికి పనికొస్తుంది. వానలు కురిచినప్పుడు ఆ కోపుల్లో నీళ్లు నిలబడి ఉంటాయి. ఎండాకాలం ఎండ తీవ్రత ఎక్కువ కావడం వల్ల కోపుల్లో ఉండే నీళ్లు అడుగు భాగానికి చేరుతాయి. అలా అడుగు భాగానికి చేరిన నీళ్లు ఒక్కొక్క చుక్క నీళ్ల కలిసి మళ్ళీ పైకి ఉబికి, కోపు నుండి ఎలా బయటకు దూకాలన్నదే ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ వస్తువు.
నవల రచయిత పరిచయం పేరు డా.వెన్నం ఉపేందర్‌ వారి తల్లి వెన్నం అనసూర్య, తండ్రి కీ.శే.వెన్నం వెంకటేశం. వీరిది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సూర్యాపేటజిల్లాకు సుమారు 35 కి.మీ దూరంలోని కుక్కడం అనే గ్రామానికి దగ్గరలో ఉన్న గుమ్మడివెళ్లి అనే ఊరు. 1978 సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చినకరవు ఎంతోమంది జీవితాలను దుర్భర పరిస్థితుల్లోనికి నెట్టి వేసిందట. ఆ కాలంలో వర్షాలుకురవక నీటిఎద్దడి ఏర్పడి, పంటలు ఎండిపోయి, ఊర్లన్ని కరువు కాటకాలతో బీటలు వారిన నేలగా వాడిపోయేనట.
పేదరికం తీరుతెన్నులు ఎంతో మంది ముఖచిత్రాలను చిదిమేస్తుంటే.. చదువుకోవాలనే పచ్చని కోరికను ఎడారిలా మార్చేస్తుంటే. మా ఇండ్లకు మసిపేలికాలు తోరణలుగా దర్శమిస్తుంటే. నూరేళ్లు బతకాలన్న ఆశ సగం ఆయుష్షు దరి చేరకుండా. పాతికేళ్లకే ముఖం మీద ముడతలతో కాటికి కాళ్లు చాపుతుంటే. ఇక మీరు ఎలా తల్లిదండ్రులను ఉద్ధరించేదంటూ పేదింటి పిల్లల్ని వెంటాడే సమాజం మాట!
కొంతమంది జీవితాలు గురించి చెప్పితే తరగని ముచ్చట్లు.. అవన్ని కన్నీళ్ల జాడలే.. వాళ్ళు అను భవించి బతికిన క్షణాలు.. ఆ బాధలు …నెమరేసు కుంటే మింగుడు పట్టక నాలుక మీద బరువైతాయి. కొన్ని సందర్భాల్లో కొందరిని చదివి తెలుసుకుంటే అనిపిస్తది. అలాంటి అధమ స్థాయి జీవితం నుంచి ఎలా ఉన్నతమైన స్థాయికి ఎదిగారని. వెలుగు విలువ తెలవాలంటే జీవితం చీకటారణ్యంలో సాగాలి కదా! అనుభవానికి మించిన గురువేవ్వరు లేరన్న రచయిత మాట నిజమే కదా! తన బాల్యంలో అనుభవించిన బాధలు, కష్టాలు వాటి నుంచి నేర్చుకున్న విషయాలను పాఠాలుగా మనకు చెప్పినారు.
అక్షరీకరించిన జీవితం/కాలే కడుపుకు కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశు మూత్ర పూత/నీ వల్ల గాదన్న నిచ్చెన ఎక్కి తీరాలి.. నాలుగు రోడ్లు, నలభై రకాలుగా చీలిపోయినా, అందులో ఎల్లవేళలా నమ్ముకోదగింది చదువు అని చెప్పుతూ గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలి ..ఎన్ని అడ్డుగోడలు ఎదురైనా, చదువుని నిర్లక్ష్యం చేయొద్దని ఇందులో వారి ఇచ్చిన సలహా.
అనాథలా జీవనం – చితికిన పసితనం/బతుకంటేనే పోరాటం.. జీవంతో ఉన్న ఏ జీవికిది అతీతం కాదు..పోరాటం చివరి అంకంలో ఉన్నప్పుడు మనిషి పడే ఘర్షణ అంత ఇంతా కాదు అంటారు/యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ భవన్‌ వారి అనుభవం/సర్కారు బడిల అయిదో తరగతి/హై స్కూలు చదువులు – ఆమ్లపు చినుకుల స్పర్శలు/ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊరికి, ఎనిమిదో తరగతి కోసం కాలిబాటలో పొలం ఒరాలపై నడుస్తుంటే గుర్తుగా జూసి పక్కకు జారుకునే పాములు,ఎండ్రకిచ్చలు/పోతుంటే కసిదీర గుచ్చుకున్న తుమ్మముండ్లు/పిడికెడన్నం కరువైనోలు శాన మందితో కలిసి రెండు ముద్దల బువ్వ దొరుకుతదని పోయినంత చదుకోవచ్చన్న ఆశకు ప్రభుత్వ హాస్టల్‌ ప్రాణం పోసింది/నెలకి సబ్బుల బిల్లుల కింద మంజూరయ్యే నాలుగు రూపాయలకు లైఫ్‌బాయ్‌ సబ్బోచ్చేది. దాన్ని ముక్కలు ముక్కలు జేసుకుని, ఆర్నెల్లు వాడుకునేవాడిని/సినిమా చూద్దామా – అయ్యో శని మామా/అయ్యా రాక రాక లవకుశ సీనిమోచ్చింది. జర సూడనియ్యండి బాంచన్‌ అంటూ సినిమా సంగతులు/మా ఊరు,మా ఇల్లు – ఎప్పటికీ ఒడవని ముచ్చట/మా ఊరంటే గుప్పడు మనస్సులో ఇమడిన గోస నరనరా జల జలా పారే ఎండమావి బుంగ.ముగింపు లేని ఓ ఎలిజీలా కలుక్కుమంటుంది. అంటూ ఊళ్ళో నివసించే ప్రజలు పడే బాధలు, కష్టాలు, రచయిత జీవనం శైలిని ప్రస్ఫుటమవుతుంది. అన్ని కుల వృత్తులను, వ్యవసాయం రైతు కుటుంబంలో కలిగే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చెప్పినారు/తెగి అతికిన ఇంటరు – కంట అలుగు బోసిన కన్నీరు/పది సదువు కాగానే: ‘‘మీ వోడు పది సదివిండు.. పిలగాడు బాగానే సదివిండు. ఉద్యోగం యేడోస్తదని ..యేదన్న పనిలో కుదురమని…ఓ మోటార్‌ సైకిల్‌ రిపేర్‌ పనిలో నాలుగు పైసలు వస్తాయని.. ఇంటర్‌ ఎందుకని.. ఐ టి ఐ చేస్తే షాప్‌ పెట్టవచ్చని ..బయట వాళ్ళు ఇచ్చిన సలహాలు ఒకవైపు…
నువ్వు సదువు కోవాలి బిడ్డ.. సదివి నువ్వు కొవ్వొత్తి గావాల.. నలుగురికీ వెలుగు పంచాల ఈ బాధలు అన్నీ నేను చూసుకుంటా నువ్వు రంధీ పెట్టుకోకు వారి అమ్మ ఇచ్చిన అభయం మరో వైపు..ఇంటర్‌ చదవాలంటే 40 కిలో మీటర్ల దూరం/ కలలతో ములాకతు చీకటి చిక్కబడే కొద్దీ, కలలు బొమ్మలై ఎదురుంగ కూకొని, ముచ్చట బెడ్తుంటై. కలో గంజో తాగి కడుపు నింపుకునే వారికి కలలు ఒక బలం అని చెప్పుతారు/ అమ్మ గాయపడ్డ కల/కుండ పగిలిన కల/చెదిరిన పెళ్లి కల/చచ్చి, మరల బతికిన కల/మా నాయన ఖాలిన బడ్డ కల/తెగి పోతున్న తల్లి వేర్ల కల/స్వామీ! ఎన్నో సంవత్సరాలు చూస్తుండగానే, కురిసిన వాన చినుకుల్లా ఇంకిపోయినయి/మా జీవితాలే అప్పుపడ్డయి/ మరణమా – రణమా/ ఇంజనీరింగు సదువు – కడుపు నింపిన ఆదరువు/ ఇంజనీరు కాలేజీలో సీటు వచ్చింది కానీ పీజు కట్టేందుకు డబ్బులు లేక వారుపడ్డ కష్టాలు…
కుటుంబ తల్లి వేరు – చింత చెట్టు అన్నట్లుగా /ఇంటి చింత చెట్టే తనిచ్చే చింతపండు తో నాలుగు సంవత్సరాలు తల్లి, కొడుకును పోషించింది/ఎవరో ఇచ్చిన ఖాకీ రంగు ప్యాంటు, అది ఒదుకులుగా ఉండటంతో పీనీసు పెట్టి కట్టుకొని మడతలు పడి మాసిన అంగీతో ఇంజనీర్‌ చదువు కోసం వారు వెళ్ళిన పరిస్థితి /కొన్ని నమ్మితే, చెడి పొయ్యేది ఏమీ లేదు/సింగరేణి నుంచి సివిల్స్‌ దాకా/ఇంజనీరింగు చదువు అయిపోయింది కానీ, వెంటనే ఉద్యోగం రాలేదు/వారు ఏ మాత్రం కుంగిపోకుండా కఠోర శ్రమతో కార్యదీక్షతో సివిల్స్‌ ఉద్యోగం సాధించారు. కృషి పట్టుదల కలిగిన డా.వెన్నం ఉపేందర్‌ వ్యక్తిత్వం, పేద మధ్య తరగతి విద్యార్థులకు వారు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.
డా.వెన్నం ఉపేందర్‌ తన జీవితంలో నేర్చుకుని అనుసరించిన నాలుగు పాఠాలు మనకు అందించారు. ఎంతోమంది చదువులేక, ఆర్థికపరమైన సాకులు చెబుతూ, వారి జీవితాలను ఎటూ కాకుండా చేసుకుంటున్న యువతలో కొంతమందికైన మేలు జరగాలనేది ఈ జీవిత నవల పరమార్థం.

  1. జీవిత పాఠం: సదువుకు.. ఆకలికి ముడి పెట్టవద్దు,..
  2. జీవిత పాఠం:ఇవ్వాళ పోతే రేపు రెండో రోజు..
  3. జీవిత పాఠం:చెరువు ఎప్పటికీ ఎండే ఉండదు…
  4. జీవిత పాఠం: కష్ట మెదురైతే చేసేదేమీ లేదు..ఇష్టంగా ఎదుర్కోవడమే..
    డా.వెన్నం ఉపేందర్‌ కవి, రచయిత, గొప్ప మానవతావాది. తన జీవితాన్ని చక్కని నవలగా రచన చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వారి కలం నుంచి మరిన్ని రచనలు జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తూ…
    కొండేటి ప్రకాష్‌, 7981781086

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img