Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 11, 2024
Wednesday, September 11, 2024

వర్తమాన సమాజంలోని ఉక్కబోతను స్పర్శించిన కథలు

కాలం కొత్త చిరునామా రెక్కలు తొడుక్కున్నా, సమాజం పుస్తకంలో ఇంకా ఇంకా పితృస్వామ్యం పాఠాలే. ఆడపిల్ల పుట్టుకని ఆహ్వానించని పాతరాతి యుగం భావాలే. ఉదయాలు వికసించక ముందే ఉరుకుల పరుగులబతుకులు. మలినమైన మానవసంబంధాల మరకలు. అధికారుల కొక న్యాయం. అణగారినవర్గాల వారికొక న్యాయం. వర్తమాన సంక్షోభ సమాజాన్నిచూచి కలవరపడిన కలంనుంచి వెలువడిన కథలే ఈతకోట సుబ్బారావు ‘పోడుగాలి’ కథలు. ఈతకోట సుబ్బారావు సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయిత, కవి, సంపాదకులు. ఇటీవల వెలువరించిన ‘పోడుగాలి’ కథా సంపుటిలో ఇరవైఒక్క కథలున్నాయి. కథలన్నీ ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబిస్తున్న కథలు.
పెద్దచేప చిన్నచేపను తినడం సహజం. అలాగే డబ్బున్న వాళ్లు బీదలను దోచెయ్యడం మరింత సహజం. ‘కొర్రమీనుల కయ్య’ లో సిద్ధారెడ్డి చేపల చెరువు యజమాని. నక్కిరయ్య ఆ చెరువును కాపలా కాసే కూలీ. శ్రామికులు చెమట చిందించి కష్టపడి పనిచేస్తారు నమ్మకంగా. శ్రమకు తగిన ఫలితం రాక పోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు. దేనికీ ఆశపడరు. యజమానికి ఒకసారి నక్కిరయ్యమీద అనుమానం వస్తుంది. ఒకరోజు నక్కిరయ్య భార్య సెందిరి చేపల కూర వండుతుంది. మట్టికుండలో చేపలు తన చెరువులో చేపలేనని అనుకొంటాడు. చెరువులో చేపల్ని వండుకున్నందుకు నక్కిరయ్యను పనిలోనుంచి తీసేస్తాడు. తీరా తినేటప్పుడు తెలుస్తుంది. ఆ చేపలు తన చెరువులోని కొరమీను కావని. డబ్బున్న వాళ్ల అహంకారం కష్టజీవుల నిజాయితీ ఈ కథలో బాగా ప్రతిబింబించాయి.
ఇటీవలి కాలంలో సరోగసీ సంస్కృతి పెరిగింది. ఆడుగడుగునా సంతాన సాఫల్య కేంద్రాలు ఇటీవల అద్దె గర్భాలు వచ్చాయి. దీనికి పేద స్త్రీలు ప్రధాన ఉపకరణాలు. నిస్సహాయ పేద స్త్రీలు డబ్బు కోసం అద్దె గర్భాలు మోసి నానా అగచాట్లు పడతారు. ప్రసవం అంటేనే, స్త్రీకి పునర్జన్మ. సొంత బిడ్డల కోసమే కాకుండా అవసరార్థం అద్దె గర్భాలు మోసినా ఆ గర్భంలో ఉన్న తనదికాని శిశువుల కోసం కొందరు ఆరాటపడతారు. కానీ కోరికలు నెరవేరవని తెలిసి ఊరుకొంటారు. కానీ ‘అమ్మ కడుపు చల్లగా’ లో విశాల తన అద్దె గర్భంలో పిల్లాడిపై మమకారంతో జైలులాంటి ఆ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేస్తుంది.
‘బంధం’ ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నదానికి ఉదాహరణ. ‘పుత్రుడు పున్నామనరకం నుండి తప్పిస్తాడు’ అని పితృ స్వామ్య వ్యవస్థ బల్లగుద్ది చెప్పిన ప్రవచనం. ఈ కథలో ‘రాములమ్మ’ కి ముగ్గురు కొడుకులు. వాళ్లకి పెళ్లిళ్లయిపోతాయి. తండ్రి చనిపోతాడు. రాములమ్మ ముసల్దైపోతుంది. ఊళ్లో వాళ్లందరు తల్లి కుశల వార్తలను అడుగుతారు. అది సహించలేక ముగ్గురు కొడుకులు కూడబలుక్కుంటారు. బతికుండగానే తల్లిని తీసుకెళ్లి శ్మశానంలో దించి వచ్చేస్తారు. కరడు కట్టిన కఠినత్వానికీ, పెచ్చుమీరిన స్వార్థానికీ ప్రతీక ఈ కథ. ఒకప్పుడు తల్లిదండ్రుల్ని కావడిలో మోసుకెళ్లి తీర్థయాత్రలు చేయించిన శ్రవణ కుమారుడు పుట్టిన దేశంలో బతికుండగానే తల్లిని శ్మశానంలో చేర్చిన కొడుకుల కథ ఇది.
అణుయుగంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూనే ఉన్నారు. రైలింజన్‌ డ్రైవర్లుగా, శాస్త్రవేత్తలుగా, క్రీడాకారిణులుగా, కళాకారిణులుగా రాణిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ కొందరు ఆడపిల్లల పుట్టుకనే నిషేధిస్తున్నారు. ‘ఆడపిల్ల’ కథాంశం ఇదే. ‘కొండపరియ’ పెట్టుబడిదారీ వ్యవస్థ క్రూరత్వానికి చెందిన కథ. గిరిజనుల కథ ఇది. ‘ప్రాణం చెట్టు’ నానాటికీ తీసికట్టుగా మారుతున్న మానవ సంబంధాల గురించి చెప్పిన మరో కథ.
‘పసి హృదయం’ పసిపిల్లల అమాయక హృదయాన్ని పరిచయంచేసిన కథ బాల్యంలో పసి మనసులు పాలలా, మల్లెపూవులా స్వచ్ఛంగా ఉంటాయి. ద్వేషాలు ఏమీ ఉండవు. అమ్మని ఎంతగా ప్రేమిస్తారో పెంపుడు జంతువుల్ని అంతగా ప్రేమిస్తారు. ఈ కథలో నాలుగేళ్ల పసివాడు ‘అసిరిగాడు’ తన స్వచ్ఛమైన ప్రేమతో ఇంటియజమాని భావనారెడ్డి హృదయాన్ని జయిస్తాడు. పిల్లలు అహంకారంతో మూసుకుపోయిన పెద్దవారి మనసులో కూడా ప్రేమ బీజాలు నాటగలరు అనే విషయాన్ని చెప్తుంది ఈ కథ.
ఈ పుస్తకం శీర్షిక ‘పోడుగాలి’ కథ ఆధునిక మానవ జీవితానికి ఉదాహరణ. నగరంలోని వీధులు ఎప్పుడూ నిద్రపోవు. తెల్లారకముందే బాటసారుల అడుగుల తాకిడితో మొదలవుతుంది. సాయంత్రం కాగానే స్కూళ్ల నుండి, ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థుల, ఉద్యోగుల సందడి. నగర ప్రజల జీవితాలు కూడా అంతే పొద్దుట నుంచి రాత్రి వరకు విరామమెరుగని పని. అలసిన రాత్రులలో నిద్ర కోసం ఆరాటం ‘పోడుగాలి’ లో కథానాయిక సునీతకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే అన్న ప్రాణప్రదంగా పెంచి పెళ్లి చేస్తాడు. సునీత బాగా చదువుకొని తాసిల్దారు అవుతుంది. ఒకసారి అన్నతో చిన్న గొడవ వస్తుంది. అప్పటి నుంచీ అన్న ఇంటికి వెళ్లదు. అన్నతో మాట్లాడదు. చివరకు అన్న అనారోగ్యంతో మరణిస్తాడు. అప్పుడు బతికుండగా అన్నయ్యతో మాటలాడలేకపోయానే అని బాధపడుతుంది. ఏ సాయమూ చేయలేకపోయానే అని విచారిస్తుంది.
ఇప్పుడు నగరాల్లో జీవిస్తున్న మనుషులకు ఇంటి పక్కన ఎవరున్నారో తెలీదు. ఎవరికి వారు యమునా తీరే పరిచయాలూ, స్నేహాలూ ఉండవు. రాకపోకలూ ఏమీ ఉండవు. కుటుంబ సభ్యులతో అనుబంధాలూ ఉండవు. వారి ఉద్యోగాలూ వారి ప్రపంచమూ తప్ప మరేమీ ఉండదు. మనుషుల మధ్య ఉన్న పొడిబారిన బంధాల గురించి వ్యాఖ్యానించిన కథ ఇది.
‘చేతికర్ర’ ప్రేమలో మోసపోయిన ఒక యువతి కథ. దివిజ దినేష్‌ను ప్రేమిస్తుంది. అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. మోసపోయిన దివిజ ఒక బలహీనక్షణంలో ఆత్మహత్య చేసుకోవాలని రైలుపట్టాలపై పరుగెత్తుతుంది. చివరకు కుంటి అబ్బాయి ఉపదేశంతో మళ్లీ జీవితంపై ఆశతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమిస్తుంది. ‘మిణుగురు’ కథ కూడా ఇలాంటిదే. సరోజ గృహిణి. చిన్నప్పుడే పెళ్లయి అత్తగారింటికి వస్తుంది. అందరికీ తలలో నాలుకలా మెలగుతుంది. కొంతకాలానికి ఉద్యోగంచేస్తున్న తోడికోడలికే ఇంట్లోవాళ్లు ప్రాధాన్యమివ్వడంతో తానూ చదువు కోవాలనుకుంటుంది. కానీ అందరూ ఆమె ఉద్దేశాన్ని తీసిపారేస్తారు. ఆ సందర్భంలో ఈ జీవితానికి చరమగీతం పాడాలనుకుంటుంది. కానీ తన చిన్న కూతురు వలన ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంది.
అపరిచితురాలు, మాటల మనిషి, మొనగాడు మంచి చదవదగిన కథలు. అగుణితం ఒక నిజాయితీపరుడైన తండ్రికథ. అవినీతి నిర్మూలన శాఖలో అధికారి అతడు. కొడుకు ఒక అమ్మాయిపై అఘాయిత్యంచేస్తున్న దృశ్యాన్ని కళ్లారాచూస్తాడు. ఆఫీసుకు వెళ్లి కొడుకు మీద ఫిర్యాదు చేస్తాడు. సమాజంలో అవినీతిపరులైన అధికారులే కాదు, నీతిపరులైన వారూ ఉంటారు అని నిరూపించిన కథ ఇది.
మానవ జీవితాలలోని వివిధ పార్శ్వాలను తడిమిన కథలివి. మామూలు మనుషులలోని సహజ లక్షణాలను గురించి వారిలోని బలహీనతలను గురించి వివరించిన కథలివి. సరళమైన భాషలో సూటిగా చెప్పిన కథలు. ఆలోచింపదగిన కథలు.
మందరపు హైమవతి, 9441062732

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img