Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

సముద్రమంత భావోద్వేగం కవిత్వమైతే…

జీవితం పచ్చని ఆశల ఊసులతో ఎన్నెన్నో హోయలుబోయే వాసంతసమీరం ఒకసారి...దిగులు అలలవెల్లువతో ఉప్పొంగే సముద్రమంత భావోద్వేగం మరోసారి. ప్రకృతి కరుణించి పచ్చ దనపుఒడిలో ప్రపంచాన్ని సేదదీర్చినట్టు పరిస్థితులు అనుకూలిస్తే ఉల్లాస భావోద్వేగాలు జీవితాల్ని సేదదీరుస్తుంటాయి. ప్రకృతి ప్రకోపించి ప్రకంపనలతో, జలవిన్యాసాలతో పరిపరివిధాలా భూమిని అతలాకుతలం చేసినట్టు పరిస్థితులు ప్రకోపిస్తే విషాద భావోద్వేగాలు జీవితాల్ని కల్లోలపరుస్తుంటాయి. భావోద్వేగం మనుషుల మధ్య ఆత్మీయతలకీ, మమతానురాగాలకీ పాదులు వేస్తుంటుంది. యాంత్రిక జీవనమనే జిగిబిగి జిలుగుల అల్లికల్లో కూరుకుపోయి అయోమయస్థితిలో దిక్కుతోచక అల్లాడిపోతూ తనను బ్రోచేవారికోసం తపించే మనిషికి కొండంత స్వాంతన కలిగిస్తుంటుంది. అనుబంధపు ఆమనికి పచ్చదనమై పోతుంటుంది. హృదయస్పందనలకు బాష్యం చెబుతుంటుంది. ప్రేమామృత కుండపోతై కురుస్తూ ప్రణయధారై పోతుంటుంది. పరిపరివిధాల భావోద్వేగాలు మనిషి జీవనమథనంలోంచి అమృతాన్నీ, హాలాహలాన్నీ వొలికిస్తుంటాయి. ఆ భావోద్వేగాలకు అక్షరాల్ని తొడిగే కవిత్వం వాటిని విశ్వజనీనం చేస్తుంటుంది. హృదయభాషను ఉదయమై వెలిగిస్తుంటుంది. మనిషికీ, మనిషికీ మధ్య సమైక్యతారాగాలను పలికిస్తుంటుంది. 
‘ఇక్కడ నేను క్షేమం-అక్కడ నువ్వు కూడా

ముసలి అమ్మా, పాత మంచం కోడూ
మన చిన్నబ్బాయీ, చెరువులో కొంగా…ఇప్పుడు రాత్రి, అర్ధరాత్రి
నాకేంతోచదు నాలో ఒకభయం/తెల్లని దళసరి మంచురాత్రి చీకటిఅంచు
దూరంగా పక్కడేరాలో కార్పొరేటే బూట్స్‌ చప్పుడు
ఎవరో గడ్డిమేట మీదనుంచి పడ్డట్టు-
నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక
చచ్చిన జీవుల మొరలా వుంది/అబ్బ చలి! నెత్తురు చల్లబడే చలి!
పొడుగాటి చుట్ట కాల్చినా/లిండెల్‌(రూపాయి దాని పాపం ఖరీదు)/లిండెల్‌ గుండెల్‌ హత్తుకున్నా
దాని సారానోరు నీరుతాగినా ఈ చలిపోదు….
స్పృహ తప్పిన ఎనేస్తీషియాలో/వెన్నెముక కర్రలా బిగిసింది!
యుద్ధం యుద్ధం/లిబియాలో బెర్లిన్‌లో స్తాలిన్‌ గ్రాడ్‌లో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెత్తింది
కనిపించే ఈ యూనిఫారం కింద
ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరకత
బ్రిడ్జి కింద నదిలాగ రహస్యంగా వుంది
వదలలేని మోసపు ఊబిలాగ వుంది
నేనంటే నాకే అసహ్యం
అందుకే మరీమరీ చంపుతాను, మరీమరీ తాగుతాను
ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు/ఇంకా తెల్లవారుతోంది
దూరంగా ఆల్ఫ్స్‌ మీద మంచు దుఃఖంలా కరుగుతోంది/ప్రభాత సముద్రం మీద వెండినౌకలా ఊగుతోంది
తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో! నిన్ను చూస్తానో!
అందమైన నీ తెల్లని నవ్వు నీ మెడలో
గొలుసుగొలుసులుగా కదిలినప్పుడు
అదోవిధమైన చెమ్మగిలిన చూపు
నెమలిరెక్కలా విప్పుకున్నప్పుడు
ఎన్నాళ్లకి! ఎన్నాళ్లకి!/కొన్నివేల మైళ్లదూరం మనమధ్య
ఒక యుగంలా అడ్డుపడిరది/ఇంక సెలవు మైడియర్‌
నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా
అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు
అదిగో ఇంకా/కార్పొరేట్‌ బూట్స్‌ చప్పుడు
కడుపులో నీళ్లు కదులుతున్నట్టు
జాగ్రత్త సుమీ జాగ్రత్త/నువ్వూ, పిల్లలూ, బల్లులూ అందరూ
మళ్లీ జవాబురాయ్‌ సుమీ/ఎన్నాళ్లకో మరి/సెలవ్‌! అబ్బా! చలి!
చలి గుండెల మీద కత్తిలా తెగింది
నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది’
(‘సైనికుడి ఉత్తరం’ ఖండిక నుంచి)
అంటూ దేశ సరిహద్దులో భయానక యుద్ధవాతావరణంలో అహర్నిశలూ కాపలాకాసే సైనికుడి అంతరంగాన్ని అతడి ఉత్తరం ద్వారా వివరిస్తాడు కవికులతిలకుడు బాలగంగాధర తిలక్‌. వేలమైళ్ల దూరంలో వున్న తన కుటుంబసభ్యుల సమాచారాన్ని తెలుసుకునే నిమిత్తం అర్ధాంగికి రాసే లేఖలో అతని భావోద్వేగం కవిత్వమైపోయింది. వెన్నెముక కర్రలా బిగుసుకుపోయినంత గడ్డకట్టిన చలి అతని నేపథ్యమైపోయింది. ఆ కవిత్వం అతని అంతరంగపుటలతో మనల్నీ సంలీనం చేస్తుంది. తనవాళ్లతో బాటు పాతమంచం కోడు, చెరువు కొంగ తాలూకు జ్ఞాపకాలు అతని భావోద్వేగంలో చోటుచేసుకున్నాయి. సైనికుల బూట్ల చప్పుడు మాటిమాటికీ గుర్తుచేసే కర్తవ్య నిర్వహణ అతనిని వదలలేని అనాగరిక మోసపు ఊబి అయిపోయింది. తనవాళ్ల కోసం అతనిలోని నిరీక్షణ దిగులు కరిగే ఆల్ఫ్స్‌ మంచు దుఃఖాన్ని చేసింది. యుద్ధబీభత్సానికి పురికొల్పే అదుపు తప్పిన స్వార్థాన్ని చూపించింది. ఆ భావోద్వేగపు నోస్టాల్జియాలో అతని అర్ధాంగి నవ్వు ఆమె మెడలోని కదిలే గొలుసైపోయింది. అతని చెమ్మగిలిన చూపు పురివిప్పిన నెమలిరెక్కైపోయింది. వారిద్దరి మధ్య దూరం ఒక యుగమైపోయింది. తాను వున్న డేరా ముందు కాపలాకాసే సెంట్రీ తనపాలిట గోరీ అయిపోయాడు. చలి అతని గుండెల్లో బాకులా దిగబడుతున్నా అతని జ్ఞాపకంలోని ఆమె రూపం అతనికి వెచ్చదనమైపోయింది. మొత్తంగా సైనికుడి లేఖ అయిపోయింది అతని నిలువెత్తు భావోద్వేగపు సరిహద్దురేఖ.
‘భద్రతావలయాన్ని ఎగతాళి చేసి
అక్రమంగా సరిహద్దును దాటే ఆకతాయల్లే
ఆ పద్నాలుగో రోజుకు అటో- ఇటో/వద్దువద్దనుకుంటూనే
అజాగ్రత్తగా నేననుమతించిన అసమ్మతి కణాలతో
మరో సగభాగమై నువ్వెందుకు కలిసావురా కన్నా?
నీకు పంచేందుకు రక్తం లేకే కదా
నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా
నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే కదా,
నేనిన్ను వద్దనుకున్నది!
అనుమతి లేకుండా అస్తిత్వం పొందిన నీ నేరానికి-
నా టెంపరరీఉద్యోగమూ, ఆరోగ్యమూ, నీకు మరణశిక్షను ఖాయం చేస్తే
తల్లడిల్లుతూనే,/తప్పొప్పుల మధ్య తడబడుతూనే
తలారినై బల్లెక్కి/రబ్బరు చేతుల ముసుగు నీ ముఖంపై కప్పి,
అభిమన్యుని శరాలకప్పజెప్పి/నిస్సహాయులైన పాండవుల్లా రోదిస్తూ
పెథిడ్రిన్‌ సెడేషన్‌లో నిన్ను పోగొట్టుకొని
పగిలిన జిల్లేడుకాయ తాలూకు పింజనై సోలిపోతూ
నాలోని అమ్మను పాతిపెట్టుకొని/చెరకు పిప్పినై పారిపోతూ
కంసుడి కత్తి లాంటి ప్లాస్టిక్‌ బకెట్‌ మింగిన
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ముద్దలాంటి నిన్ను చూసి
మళ్లీ నా పొత్తిళ్లలో పొదుపుకోవాలనీ
పాలకై తడుపుకునే పెదవులుగా
అమ్మకై వెతుక్కునే చూపులుగా చెక్కుకోవాలనీ,
ఛిద్రకలసాన్ని పూర్ణశిల్పంగా దిద్దుకోవాలనీ,
ఇంత సుఖంగా నిన్ను చంపుకునే మార్గం కనిపెట్టిన వీళ్ల ముఖాలపై
ఉమ్మనీళ్లతో ఉమ్మేయాలనీ వెర్రి ఆవేశంగానూ,
కడుపు చించుకుంటే/మనసు గాయం అయ్యి/కడివెడు కన్నీళ్లు దుఃఖంగానూ వుందిరా
అయ్యో!/పాలింకి పోవడానికున్నట్టు/మనసింకిపోవడానికీ-
మాత్రలుంటే ఎంత బావుండు!
(‘అబార్షన్‌ స్టేట్‌మెంట్‌’ ఖండిక నుంచి)
అంటూ పరిస్థితులకు తలొగ్గి బలవంతంగా అమ్మతనాన్ని పోగొట్టుకునే ఒక ఇల్లాలి మానసిక క్షోభకూ, పశ్చాత్తాపపు భావోద్వేగానికి అక్షరరూపమిస్తుంది పాటిబండ్ల రజని. ఒక విలక్షణ సందర్భం ఇక్కడ కవితావస్తువైపోయింది. స్త్రీ జీవితం లోని సున్నితమైన అంశం అక్షరరూపం దాల్చింది. కుటుంబ పరిస్థితులు ఊహించని అబార్షన్‌కు దారి తీస్తే ఆ పరిస్థితుల్లోంచి ఉద్భవించిన భావోద్వేగం కవిత్వమైపోయింది. అందులోని జీవనవిషాదాన్నీ, తల్లడిల్లే ఒక మాతృహృదయ నిర్వేదాన్నీ వినిపించింది.
తాను విధించుకున్న భద్రతావలయాన్ని ఛేదించి అనుకోని ఉపద్రవానికి దారితీసిన పురుషాహంకారాన్ని ప్రశ్నిస్తూనే కుటుంబ పరిస్థితుల్నీ, ఒక మధ్యతరగతి స్త్రీ జీవన అవస్థల్నీ ఏకరువు పెట్టింది. దంపతుల మధ్య చోటుచేసుకునే అవగాహనారాహిత్యాన్ని ఎత్తిచూపించింది. ఇక్కడ ఒక తల్లిని అభిమన్యుని శరాలకప్పజెప్పి నిస్సహాయులైన పాండవుల్లా రోదించేలా, పగిలిన జిల్లేడుకాయ తాలూకు పింజలా సోలి పోయేలా చేసిన పరిస్థితి ఆమె భావోద్వేగమైంది. ఆ భావోద్వేగం పశ్చాత్తాపమైపోయింది. ఆమెలోని అమ్మను హత్యచేసిన ప్లాస్టిక్‌ బక్కెట్‌ కంసుడి కత్తి అయిపోయింది. ఆ భావోద్వేగం మళ్లీ బిడ్డను పొత్తిళ్లలో మనసారా పొదుపుకోవాలని, పాలకి వెదుక్కొనే పెదవులకోసం, అమ్మకోసం వెతుక్కునే చూపులకోసం తపించేలా చేసింది. ఆవేదన భరించలేని స్థితిలో మనసింకిపోయేలా చేసే మాత్రల కోసం తపించే స్థాయికి వెళ్లిపోయింది ఆ భావోద్వేగం. సరిహద్దులో కాపలా కాస్తూ సైనికుడు దేశంకోసం శత్రువుతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు జీవన సంఘర్షణలో పయనిస్తూ ఒక స్త్రీ కుటుంబ మనుగడ కోసం పురుషాహంకారంతో యుద్ధానికి సన్నద్ధమవుతూనే వుంటుంది. ఈ రెండు సందర్భాల సముద్రాల్లోంచీ బాధామయ భావోద్వేగపు అలలు ఉవ్వెత్తుకు ఎగిసిపడుతూనే వుంటాయి. భావోద్వేగం మనిషిలోని మనిషి తనానికి అచ్చమైన ప్రతిరూపం. అందుకే అది పదికాలాలపాటు మనుషుల మధ్య అనుబంధాల వంతెనల్ని నిర్మిస్తూనే వుంటుంది. వసుధైకజీవన పరమార్థాన్ని ప్రతిఫలింపజేస్తూనే వుంటుంది.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img