London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

స్వాతంత్య్రానంతర దృశ్యం

ఎస్‌.ఆర్‌. పృథ్వి
సెల్‌: 9989223245

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ప్రతిసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని, నాయకుల జయంతులు, వర్థంతు లను ఆనవాయితీగా జరుపుకొంటున్నాం. లేని ఉత్సాహాన్ని ఎరువు తెచ్చుకుని మరీ. కాని, మనందరికీ తెలుసు. మనమెంతటి అస్వతంత్రు లమో! సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గుప్పిళ్లలో ఎలా బంధీలమయ్యామో కూడా మనకి తెలుసు. దేశ ప్రగతికి ఎన్నికలు జీవగర్ర. ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు జరగటం, నాయకులు పదవులు అలంకరించటం, ఆ పదవులను పదిలపర్చుకోవడానికి అనేక విన్యాసాలుచేయటం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ‘‘నాయకులుఓటర్లు’’ నడుమ నున్న సంబంధం ఎలక్షన్ల సమయంలో మరింత బలపడుతుంది. ఓటర్లను ఎలాగైనా సరే తమ వైపుకి తిప్పుకోవాలని చూసే పార్టీ పెద్దల పాట్లు అనేక విధాలుగా దర్శనమిస్తాయి. ఇటువంటి సందిగ్దావస్థలో జాతి యావత్తూ ‘‘చెరువులోంచి బయటపడేసిన చేప పిల్లలా కొట్టుకోవటం’’ దురదృష్టకరం. మనిషి వైజ్ఞానికంగా ఉన్నత శిఖరాల నధిరోహించగల్గినప్పటికీ, అతనిలోని మానవత్వం వికారమొందక స్వార్థ ప్రలోభాల వలలో చిక్కుకుపోవటం జరుగుతూ ఉంది. మానవతా పరిమళం స్వార్థ విషవాయువులు సోకి, కలుషితమౌతూ ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వర్గం, ఆర్థిక ప్రయోజనం కోసం మరో వర్గం, కుల ప్రాతినిధ్యాన్నాసించి ఇంకో వర్గం, మత ప్రాబల్యం కోసం మరో వర్గం ఇలా ఎవరికి వారు ఒక్కో వర్గాన్ని సృష్టించుకొని, పాలన వైపు నేత్రద్వయాన్ని కదుపుతున్నారు. ఇది జాతి ఐక్యతకి భంగపాటు అవుతుంది కదా! ‘‘స్వక దోషాల కనలేడు స్వార్థపరుండు’’ అన్నారు శ్రీయల్లాప్రగడ ప్రభాకరరావు. స్వార్థపరుడి దృష్టికి తనలోని దోషాలు ఏవీ కనిపించవు. తను అనుసరించేది అంతా మంచనే భావనలో ఉంటాడు. ఈ సమాజాన్ని ఏ దృక్పథంతో, ఏ కోణం నుండి చూసినా మంచి కంటే చెడు ధోరణులు ఆవహించి ఉన్నాయి. అమానుషత్వం, స్వార్థతత్వం, అహంకారం, ధనాధిపత్యం, పదవీ రaంకారం` ఒకటేమిటి, సకల రోగాలు వ్యాపించి, జాతిని భ్రష్టు పట్టిస్తా ఉన్నాయి.
ఒకవైపు కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైన దాఖలాలు కన్పిస్తున్నాయి. పల్లెలు కృంగిపోయి, పట్టణాలు, నగరాల దారిపట్టడం, వ్యవసాయ భూములు ఇండ్ల ప్లాట్లుగా పరివర్తన చెందటం, వైవాహిక జీవన ధారలోకి అక్రమ సంబంధాల విషం తుళ్లిపడటం, వరకట్నం, ఆర్థిక అసమానతలు, మద్యం, వ్యభిచారం, మాదకద్రవ్యాలు వంటి సాలిగూడుల్లో యువత చిక్కుకుపోయి పీనుగులవుతున్నారు. యువత మద్యానికీ, డ్రగ్స్‌కి బానిసలై పబ్బుల వెంట పరుగులు పెడుతున్నారు. వీళ్లందరూ ధనిక కుటుంబాలకి చెందినవారు. అధిక సంపాదనలో మునిగి ఉన్నవారు కావడం మనమెరుగుదం. తాగి తందనాలాడమని, పబ్బులకు, బార్‌లకు లైసెన్సు లిచ్చేది ప్రభుత్వమే కదా! ప్రభుత్వాలు ఆదాయం కోసం, జాతిని నిర్వీర్యపు ఎడారిలోకి నడిపించటం సబబేనా? ఉగ్రవాదం ఒక దారిలోను, నక్సలైట్లు మరో దారిలోను నేలను కబళించాలనే వాంఛాపరులు ఇంకో దారిలోను పయనిస్తూ, జాతి గుండెను చుట్టుముడుతుంటే, శాంతికి దేవాలయం ఎక్కడ నిర్మించాలి? మనిషిపుడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కుడిచేత్తో పెట్టి, ఎడమ చేత్తో లాక్కునే సంస్కృతి ఇప్పుడు కనిపిస్తా ఉంది. ‘మా కొద్దీ తెల్ల దొరతనము దేవా’’ అని వీధుల్లో పాడి ప్రజలను చైతన్యవంతం చేసిన గరిమెళ్ల వారి పాట గుర్తుకు వస్తా ఉంది.
ఈనాటి పరిస్థితులన్నిటికీ మూలం మనిషిలో అగ్నిజ్వాలలా రగులు తున్న స్వార్థం. తన గుప్పిట్లో జాతిని ఒడిసిపట్టి, తన కనుకూలంగా నడిపించగల నేర్పు ఉన్న జాణ ‘స్వార్థం’. తనకి లొంగిఉన్న వారి చేతిలో వజ్రాయుధంలా మారిపోతుంది. స్వార్థం చేతిలో కీలుబొమ్మైన వాడు కోరి కొరివిని, జాతి శిరస్సుపై పెడుతున్నాడన్న విషయాన్ని విస్మరించటం శోచనీయం. మనిషికి స్వార్థచింతన ఉండాలి. సామాజిక పరిస్ధితుల దృష్ట్యా, తన జీవన నేపథ్యం దృష్ట్యా ఎంతవరకు అవసరం అన్నది, ఆత్మ పరిశీలనతో నిర్ణయించుకోవాలి. సమాజం అభివృద్ధి పథంలో పయనించాలి అంటే యువత పాత్ర ప్రధానమైంది. క్రమశిక్షణకి అగ్ర తాంబూలం ఇవ్వాలి. ప్రవర్తనా సరళికి కొత్త మెరుగు దిద్దుకోవాలి. నీతిని, నిజాయితీని దుస్తులుగా ధరించాలి. ఎల్లప్పుడు చైతన్య సహితమైన, సమాజ హితమైన దారుల వెంట నడవాలి. యువతను పట్టి పీడిస్తున్న సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, కాదనను. విద్యావంతులైన యువకులు స్వయం ప్రతిపత్తి వైపు అడుగులు కదపాలి. నిరుత్సాహాన్ని వీడాలి. ప్రతిభావంతులై పొరుగు దేశాలకు వెళ్లి స్థిరపడటం ఇప్పుడు భారతదేశంలో యువత ట్రెండు. దానిని నెమ్మదిగా విడిచి, దేశాభివృద్ధి కోసం నడుం బిగించటం అత్యవసరం.
పాలక వర్గాలు కేవలం కుర్చీ నిలబెట్టుకునే రహదారిలోనే నడుస్తా ఉన్నాయి. యువతను ప్రోత్సహించి, వాళ్ల నైపుణ్యం దేశాభివృద్ధికి ఉపయోగపడేటట్లు చూడాలి. పాలన కోసం ధరలు పెంచటం, సర్వీసుల మీద కూడా టాక్సులు వేయటం, మద్యానికి బానిసలు చేసి, ఆదాయం పెంచుకోవటం, అప్పులు చేసి, ప్రజల నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టటం, మాటల మంత్రాలు వల్లించటం వంటివి మానుకోవాలి. పరిపాలనలో అనేక మార్పులు జరుగుతా ఉంటాయి. యువశక్తికి పాలనలో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంది. అలాగే జనాభాలో సగం వాటా స్త్రీ శక్తిది. వారికి సముచిత స్థానం కల్పించాలి. ఏకవ్యక్తి పాలనకు తిలోదకాలు వదిలి, అందరి సమిష్టి నిర్ణయాలతో పాలన సాగాలి. పరిపాలనా రంగంలో అందరూ పదవులను ఆశిస్తారు. స్వార్థంలేని చోట ఈ సమస్య ఏమాత్రం తలెత్తదు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, దాని మీదనే దృష్టి పెడితే పరిపాలన అభివృద్ధి వైపు సాగుతుంది. పారదర్శకత ప్రకాశిస్తుంది. అందరికీ పదవులు అనేది అసాధ్యం కదా! పదవులు ముఖ్యం కాదు, పాలన ముఖ్యమని నమ్మాలి.
కొంతమందిని సంతృప్తిపర్చటం కోసం, కొత్త కొత్త పదవులు సృష్టించటం దోపిడీ విధానంలో భాగమౌతుంది. రాజకీయాల కతీతంగా దేశానికి అత్యుత్తమ సేవలందించిన వారు, న్యాయనిపుణులు మున్నగు వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రజలు సుఖపడాలంటే, వాళ్లకి తగినపని కల్పించాలి. మద్యపానం మత్తును దూరంచేయాలి. ఏదీ, ఎవరికీ ఉచితంగా ఇవ్వరాదు. ముఖ్యంగా పాలకులు ‘ఇది నాది’ అనే స్వార్థ చింతన విడిచి, ‘మనది’ అనే జాతీయతత్వానికి జీవం పోయాలి. ఈ దిశగా పాలకులు పయనించిన నాడు, పారిశ్రామికాభివృద్ధి పెరిగి, తిరిగి దేశంలో స్వర్ణయుగం ప్రారంభమౌతుంది. భవిష్యత్తు మానవత్వంతో పరిమళించాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img