ఎగిరే పక్షికి
రెక్కలు ఆడిరచడానికి
అనుమతులు అవసరమా!
నీ నిద్ర నీది
ఎప్పుడు లేవాలో
ఎవరో నిర్ణయిస్తే
నీకు స్వేచ్చ ఉన్నట్టా?
మల్లెలు పరిమళించడానికి
మయూరం పులకించి
నాట్యం చేయడానికి
ఆంక్షల సంకెళ్లా?
ఎవరో ఏదో చేయలేదని
బాధపడతావా!
నీ సంతోషం
వేరేవారి చేతిలో ఉండొచ్చా?
శ్వాస తీసుకోవడానికి
శాసనాలు అవసరమా?
స్వేచ్చలేని చోట
స్వచ్ఛత ఉండదు!!
నీ కాళ్ళు
నీ చెప్పుల్లో పెట్టుకో
నీ చేతులు
నీ జేబులో పెట్టుకో
ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు
నీ దారిన నీవు సాగిపో!
నిన్ను నీవు ప్రేమించు!
నీ జీవితం నీవు జీవించు!!
జగ్గయ్య. జి, 9849525802