ఉన్నావో నుంచి ఆర్జీ కర్ వరకు ఆడబిడ్డలకు రక్షణ కరువు
న్యాయం కోసం తప్పని పోరాటాలు` సంవత్సరాల నిరీక్షణ
న్యూదిల్లీ : స్రీలను దేవతలుగా పూజించే భారతదేశం అత్యాచారాలకు కేరాఫ్‌గా మారింది. దేశంలో మహిళలకు రక్షణ కరవైంది. అత్యాచార కేసుల్లో న్యాయం కోసం సంవత్సరాల నిరీక్షణ… పోరా టాలు తప్పడం లేదు. ఏటా 30వేలకుపైగా అత్యాచారాలు నమోద వుతున్నాయంటే దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఉన్నావో మొదలు కథువా, హత్రాస్, కోల్‌కతా, బద్లాపూర్ తరహా ఘటనలతో మహిళల రక్షణకు చేసిన చట్టాలన్నీ నీరుగారిపోతున్నాయని స్పష్టంచేశాయి. గత సంవత్సర కాలంలో 31,516 అత్యాచార కేసులు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. కామక్రీడకు బాల్యం, కౌమారం, యవ్వన్నం బలవుతోంది. గంటకు 90 మంది మహిళలు అత్యాచారానికి గురవుతు న్నారని జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)2022 నివేదిక తెలిపింది. శిక్షలు పడిన కేసులు 27
28శాతం మేర ఉన్నాయని పేర్కొంది. రాజకీయ నేతల ప్రకట నలు, న్యాయం జరగడంలో జాప్యం, పోలీసుల అసమర్థత వంటివి ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోకడానికి కారణాలవుతున్నాయి. హేయమైన నేరాలు జరిగినప్పుడు నిందాక్రీడను రాజకీయ నేతలు మొదలు పెడతారు. పరస్పరం దూషించుకుంటారు. ఉన్నా వో నుంచి ఆర్జీ కర్ వరకు అమానుష, హేయమైన నేరాలు సభ్యసమాజం తలెత్తుకునేందుకు వీల్లేకుండా చేశాయి. అభంసుభం తెలియని పసివారి నుంచి చర్మం ముడతలు పడిన బామ్మల వరకు అత్యాచారానికి గురికావడం కలచివేస్తోంది. ఈ దేశం ఎటుపో తోందన్న ప్రపంచ స్థాయి చర్చకు తావిస్తోంది.
హత్రాస్
2020, సెప్టెంబరు 14న 19ఏళ్ల దళిత యువతి ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. నాలుకను కోసివేయగా శరీరమంతా గాయాలతో రక్తం మడుగులో పడివున్న ఆమెను తల్లి గుర్తించారు. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు సెప్టెంబరు 29న చనిపోగా 30వ తేదీన అర్థరాత్రి సమయంలో అంత్యక్రి యలను పోలీసులు బలవంతంగా నిర్వహించారు. వార్త సేకరణకు వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దీఖీ కప్పన్‌ను నిర్బంధిం చడం మరో వివాదానికి తెరతీసింది.
హైదరాబాద్
2019 నవంబరులో 20ఏళ్ల వైద్యురాలిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. హైవే టోల్‌ప్లాజా వద్ద ఆమె స్కూటీ పంక్చర్ చేసి, పొదల్లోకి ఈడ్చుకెళ్లి హత్యాచారానికి ఒడిగ ట్టారు. లారీ డ్రైవర్లు, వారి సహాయకులు నలుగురిని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబరు 5న సీన్ రిక్రియేట్ సమయంలో ఆ నలుగురిని కాల్చిచంపారు. పోలీసుల చర్యను జనం స్వాగతించారు.
కథువా: బఖెవాల్ వర్గానికి చెందిన కుటుంబాన్ని తరిమివేయడం కోసం 2018 జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై కథువాలోని ఆలయ అర్చకుడు హత్యాచారానికి ఒడిగట్టాడు. సాక్ష్యాధారాలు నాశనం చేసిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్చకుడు సంజీ రామ్ ప్రధాన నిందితుడని తేలడంతో… అతనితో పాటు మరో ఇద్దరికి 25ఏళ్ల శిక్ష పడిరది.
ఉన్నావో: అధికార దుర్వినియోగానికి నిదర్శనగా ఉన్నావో ఘటన నిలిచింది. ఇంట్లో పని అమ్మాయిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ 2017 జూన్ 4న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత సీఎం యోగి ఇంటి ముందర బాధితురాలు నిప్పంటించుకోవడంతో నేరం వెలుగులోకి వచ్చింది. అధికారంలో ఉన్న వ్యక్తి యంత్రాంగాన్ని ఏ విధంగా ప్రభావి తం చేయగలడో ఈ కేసు ప్రతిబింబించి ంది. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రి కస్టడీలో చనిపోయారు. సినీఫక్కీలో బాధితురాలి, ఆమె ఇద్దరు అత్తలు, లాయర్ వెళుతున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఇద్దరు అత్తలు అక్కడికక్కడే చనిపోగా బాధితురాలు, ఆమె న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన రెండేళ్ల కు బీజేపీ నుంచి కుల్దీప్ బహిష్కరణకు గురయ్యారు. 2020లో ఆయనకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిరది.
నిర్భయ
2012, డిసెంబరు 16వ తేదీ రాత్రి స్నేహితుడితో కలిసి ఇంటికి వెళుతున్న నిర్భ యపై బస్సులో సామూహిక అత్యాచారం అత్యంత పాశవికంగా జరిగింది. వివస్త్రరాలిని నడిరోడ్డుపై పడవేసి దోషులు పరారయ్యారు. ఆమె 17 రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. సింగపూర్‌కు ఎయిర్ లిఫ్ట్ చేసినా ఫలితం లేకపోయింది. తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరితీశారు. 2015 తర్వాత ఉరి శిక్ష అమలు కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత నిర్భయ చట్టం వచ్చింది.
పార్క్ స్ట్రీట్, కోల్‌కతా
2012 ఫిబ్రవరిలో కోల్‌కతాలోని నైట్‌క్లబ్‌లో స్నేహితులను కలిసేందుకు వెళ్లిన యువతి పై అత్యాచారం జరిగింది. కదలుతున్న కారులో నగరమంతా తిప్పుతూ ఆమెను రాత్రంతా లైంగికంగా వేధించారు. పోలీసు లను ఆశ్రయిస్తే వారు బాధితురాలి చరిత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది బూటకపు కేసని బెంగాల్ సీఎం అప్పట్లో వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు, ప్రముఖులతో సంబం ధాలు ఉన్న తన దోషులను శిక్షించేందుకు ఆమె సుదీర్ఘ పోరాటాన్ని సాగించారు. మెనింగిటిస్ వ్యాధితో 2015లో ఆమె చనిపోయారు. ప్రస్తుతం ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలిపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. వైద్యురాలికి న్యాయం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకోసం ఎన్ని రోజు… ఎన్నాళ్లు వేచిచూడాలో అన్న సందేహం వ్యక్తమవుతోంది.