దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు. గత ఏడాది డిసెంబరు 2న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ఒక నెలలోగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు బడ్జెట్ కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలని తెలిపిందని చెప్పారు.