న్యూదిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దిల్లీ సీఎంకు జెడ్ కేటగిరీ భద్రత లభిస్తుంది. ఆతిశీకి రక్షణగా 22 మందిని షిఫ్టుల వారీగా దిల్లీ పోలీసులు మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో భాగంగా ఆమెకు రక్షణగా పీఎస్‌వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. కేంద్ర సంస్థలు ఆమె భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ఇదిలావుంటే దిల్లీలో అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాన్ని పెంచుతూ ఆతీశీ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని సీఎం వెల్లడిరచారు. నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రూ.18,066, మధ్యస్థ నైపుణ్యం కలిగిన వారికి రూ.19,929, నిపుణులకు రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గౌరవప్రద జీవితాన్ని అందించేందుకు అవసరమైన ప్రతి చర్యనూ తీసుకుంటామన్నారు.