నవాబ్‌మాలిక్
షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ వచ్చిన అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘పిక్చర్ అబి బాకీ హై మేరే దోస్త్’ (సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా) అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆర్యన్‌ను జైలుకు పంపిన వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ‘పరిస్థితి ఎంతలా మారిపోయిందో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఏ వ్యక్తైతే ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ ఆఫీస్‌కు ఈడ్చుకొచ్చాడో ఇప్పుడు ఆ వ్యక్తే కటకటాల వెనుక ఉన్నాడు. ఆర్యన్‌ను అతడి మిత్రుల్ని బెయిల్ రాకుండా ఉండడానికి ఆ వ్యక్తి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అతడే బెయిల్ కోసం కోర్టు తలుపులు తడుతున్నాడు’ అని అన్నారు.