London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ఆ పార్టీ అధికారంలో ఉంటే..లఖింపూర్‌ కేసులో న్యాయం జరగదు

నోట్ల రద్దుతో సాధించిందేమిటి
బీజేపీ విధానాలపై మండిపడ్డ అఖిలేష్‌ యాదవ్‌

లక్నో : యూపీలో బీజేపీ అధికారం ఉన్నంత కాలం లఖింపూర్‌ ఖేరీ కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్నదాతల ఆగ్రహానికి కారణమైన ఈ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ కేసులో ఎవరిని ఇరికించాలి, ఎక్కడ దర్యాప్తు చేయాలనేది కాషాయ పార్టీ నిర్ణయిస్తోందని ఆరోపించారు. దిల్లీ, లక్నో, లఖింపూర్‌లోని బీజేపీకి చెందిన వ్యక్తులు రాష్ట్రంలోని శాంతిభద్రతలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసులో నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై గతంలో కోర్టులు అనేకసార్లు మొట్టికాయలు వేసాయని విమర్శించారు. కేసు దర్యాప్తు సరిగా లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరపడానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తితో రోజువారీ పర్యవేక్షించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. అన్నదాతలపై వాహనాన్ని నడిపి నలుగురిని పొట్టనపెట్టుకున్న ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా కేంద్ర మంత్రి కుమారుడని అయినా సదరు మంత్రిని ఇంకా కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరప్‌ కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం కేసులో న్యాయం జరుగదని తాము భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఐదేళ్ల క్రితం నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దుతో సాధించిన ఫలితాలేమిటని కేంద్రాన్ని నిలదీశారు. ఇప్పటిదాక నోట్ల రద్దుతో ప్రజలకు అందిన ప్రయోజనాలేమిటో చెప్పాలని డిమాండు చేశారు. నాడు నల్లధనంలపై మాస్టర్‌స్ట్రోక్‌ అని చేసిన పెద్దనోట్ల రద్దు బ్రెయిన్‌స్ట్రోక్‌గా విఫలమైందని ఎద్దేవా చేశారు. అసంబద్దమైన నోట్లరద్దు నిర్ణయంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీసి, విదేశాల్లోని నల్లధనాన్ని కూడా తెస్తామని ఇచ్చిన హామీల అమలు ఎక్కడని ప్రశ్నించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలతో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితా ఇవ్వకుంటే ఆందోళన : అఖిలేష్‌
వచ్చేఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుది ప్రచురణకు ముందుగానే ఓటర్ల జాబితా ముసాయిదాను రాజకీయపార్టీలకు అందించాలని అఖిలేష్‌ యాదవ్‌ డిమాండు చేశారు. రానున్న జనవరి 5నాటికి ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రచురిస్తున్నందున అంతకంటే ముందే ముసాయిదా ఓటరు జాబితాను అందించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్త ఓటర్లుగా ఎవరు నమోదు చేసుకున్నారు, ఎవరి ఓట్లను తొలగించారనే విషయం రాజకీయ పార్టీగా తాము తెలుసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో స్పందించకపోతే ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళను చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img