పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్ధులు ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో విద్వేష రాజకీయాలు, ప్రచార హంగామాల కంటే అభివృద్ధి రాజకీయాలు, ఐక్యతకే బెంగాల్ మొగ్గుచూపుతుందని వెల్లడైందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఇది ప్రజా విజయమని అభివర్ణించారు. ప్రజల ఆశీస్సులతో బెంగాల్ పురోభివృద్ధికి తాము పాటుపడతామని అన్నారు. ఉప ఎన్నికలు జరిగిన ఖర్దా, శాంతిపూర్, గొసాబ, దిన్హాట స్ధానాల్లో టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళుతుండగా ఇక్కడ ఆ పార్టీ విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.