న్యూఢల్లీి : పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సాగు చట్టాలు, స్నూపింగ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లో ఇవాళ కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేశారు. మోదీ ప్రభుత్వం చర్చలకు దూరంగా పరుగెడుతున్నట్లు విపక్షాలు లోక్‌సభలో ఆరోపించాయి. వర్షాకాల సమావేశాల్లో మూడవ వారం ముగియడానికి వచ్చిందని, ఇంత వరకు ఎటువంటి సభావ్యవహారాలు సాగలేదని, విపక్షాలతో ప్రభుత్వం చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు.