శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌కు చెందిన కుల్గామ్ జిల్లాలో గురువారం భద్రతా దళాలతో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన చవల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి అందిన సమాచారంతో భద్రతా దళాలు అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతంలో బలగాలు సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారి వివరించారు. అయితే భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. కానీ ఏ గ్రూపునకు చెందిన ఉగ్రవాది అనేది తెలియరాలేదు. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.