పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని, వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ట్వీట్‌లో కోరారు. అమరీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ సైతం ఇటీవల కొవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. 79 ఏళ్ల అమరీందర్ సింగ్ ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని సొంతంగా ఏర్పాటు చేశారు. త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు.