తెలంగాణ
చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహద్దులో చోటు చేసుకుంది.. ఘటనా స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ దళాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బీజాపూర్, ములుగు సరిహద్దులోని తర్లగూడ వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ ధ్రువీకరించారు.