న్యూదిల్లీ : గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ అస్థానాను దిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడంపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. న్యాయవాది సలేర్ ఆలం వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రిత్వశాఖ దిల్లీ పోలీసు కమిషనర్‌గా ఆస్థానాకు ఇచ్చిన నియమాక ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ జులై 27న పిటిషన్ కోర్టును అభ్యర్ధించారు. ప్రకాష్ సింగ్ కేసులో గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్థానాకు కనీసం ఆరు నెలల పదవీకాలం లేదని, ఈయన నియామకంలో యూపీఎస్‌సీ నుంచి ఎలాంటి ప్యానల్ ఏర్పాటు చేయలేదని, ఆ స్థానానికి కనీసం రెండేళ్ల సమయమైనా ఉండాలని’ ఆలమ్ పిటిషన్ వేశారు. అయితే కేంద్రం తన అఫిడవిట్‌లో ప్రజల కోరిక మేరకే ఆస్థానా దిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ఆయన సర్వీసును పెంచామని, దేశ రాజధాని ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సవాళ్లను, జాతీయ భద్రత, అంతర్జాతీయ సరిహద్దు చిక్కులను దృష్టిలో పెట్టుకునే ఈ నియమాకం చేపట్టినట్టు పేర్కొంది.