దేశంలో ఇప్పటివరకు 45కోట్లకుపైగా టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఒకే రోజు 39,42,457 మోతాదులు వేసినట్లు తెలిపింది. ఇందులో 18-44 ఏళ్లలోపు వారికి 20,54,874 మొదటి.. 3,00,099 రెండో మోతాదు అందజేశారు. మూడో విడత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి 18-44 వయసు వారు 14,66,22,393 మందికి మొదటి, 71,92,485 మంది రెండో మోతాదు వేశారు. బుధవారం నాటికి టీకా డ్రైవ్ 194వ రోజుకు చేరింది. ఒకే రోజు 39,42,457 టీకాలు వేయగా.. 27,41,794 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 12,00,663 మందికి రెండో మోతాదు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.