న్యూదిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం మరోమారు ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. నిరంతర ధరల పెరుగుదల కారణంగా పండుగ స్ఫూర్తి మసకబారిందంటూ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఆహార సరుకులు, ఎల్‌పీజీ ధర నిరంతరం పెరుగుతుండటం సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్న వార్తా కథనాన్ని రాహుల్ ఉటంకించారు. ‘ మోడీజీ కృతజ్ఞతలు.. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఆహార వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. పండుగ స్ఫూర్తి క్షీణించింది’ అని ఆయన హిందీలో ‘‘ధరల పెరుగుదల’’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.