దేశంలోని ఐదు రాష్ట్రాలకు జరుగునున్న రెండవ దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో అన్ని పార్టీలు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి. దేశ జనాభాలో 20 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్ పూర్తయింది. ఇక్కడ 11 జిల్లాల్లోని 58 స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరిగింది. రెండోదశ పోలింగ్ ఫిబ్రవరి 14న జరుగనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రెండో విడత ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా పెద్ద నాయకులందరూ శుక్రవారం జిల్లాల్లో రెండో విడత ఎన్నికల కోసం బహిరంగ సభలు నిర్వహించి తమ అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. ఫిబ్రవరి 14న రెండో దశ ఎన్నికలు జరగనుండగా, శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది.